- లేనిది ఉన్నట్టుగా రాయొద్దని మీడియాకు విజ్ఞప్తి
- 11 కేసులు యాక్టివ్‌లో ఉన్నాయని అఖిలప్రియ వెల్లడి
- మూడురోజులు చికెన్ షాపులు బంద్‌కు నిర్ణయం
- వైద్యశిబిరాలు, శానిటైజేషన్ నిర్వహించాలని ఆదేశం
ఆళ్లగడ్డ(చైతన్యరథం): పట్టణంలో అతిసార ప్రబలిన ప్రాంతాల్లో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా శనివారం పర్యటిం చారు. వందల సంఖ్యలో అతిసార కేసులు నమోదు అయ్యాయని, ముగ్గురు మరణించారని సాక్షి, టీవీ9 చానళ్లు కథనాలు ప్రసారం చేశాయి. ఆసుపత్రిలో సరైన వసతులు లేవని, బెడ్లు లేవని కథనాలు రావడంతో స్పందించి వారు సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అఖిలప్రియ మాట్లాడుతూ యూపీహెచ్‌లో ఎక్కువమంది బాధపడుతున్నారని అదనంగా బెడ్స్ తెప్పించినట్టు చెప్పారు. మీడియా మిత్రులు ఉన్నది ఉన్నట్టుగా రాయాలని సూచించారు. ఏదో సాక్షిలో వచ్చిందని మీరందరూ కూడా లేని వాటిని ఉన్నట్టుగా రాస్తే ప్రజలు భయాందోళనకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలో కేవలం 11 కేసులు మాత్రమే యాక్టివ్‌లో ఉన్నాయని మిగిలిన వారందరూ డిశ్చార్జ్ అయ్యారని వివరిం చారు.
చనిపోయిన ముగ్గురిలో కూడా హుస్సేన్ బాషా(75) గుండె నొప్పితో చనిపోయారని తెలిపారు. చంద్రమోహన్(45) నిమజ్జనం రోజు ఆల్కహాల్ తీసుకుని లైట్‌గా మోషన్స్ రావ డం, అందులోనూ టీబీ పేషెంట్ కావడంతో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఆసుపత్రిలో చేరితే వైద్యం అందిస్తామని చెప్పినా తనకు ఎటువంటి సమస్యా లేదని చెప్పాడని ఆయన భార్యే చెప్పిందని తెలిపారు. మరో మృతురాలు ఇమాంబీ(70) కిడ్నీ రోగి కాగా షుగర్, బీపీ కూడా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ఉన్న 11 కేసులలో కూడా 90 ఏళ్లకు పైబడిన వృద్ధురాలు ఉన్నారని..ఆమెకు ఏదైనా అయితే అతిసారతో చనిపోయిందని ప్రచారం చేస్తారని… వయ సు అయినా చూసుకోవాలి కదా అని ప్రశ్నించారు. మున్సిపల్ కార్యాలయ సిబ్బంది కరపత్రాలు కొట్టించి అతిసారపై జాగ్రత్తల వివరాలు తెలియజేస్తూ ఆళ్లగడ్డ పట్టణంలో ప్రతి ఇంటికి పంచాలని సూచించారు. ప్రతిఒక్కరూ వేడి నీళ్లనే తాగాలని, శుభ్రమైన కూరగాయ లను తినాలని సూచించారు. బయటి వస్తువులు తినరాదని…ఇంట్లోనే చేసుకుని తినాలని ఆళ్లగడ్డ ప్రజలకు సూచించారు.
చికెన్ షాపులు బంద్.. వైద్యశిబిరాలు నిర్వహించాలి
ఆళ్లగడ్డ పట్టణంలో ప్రతి ఏరియాలో శానిటేషన్ చేయించామని చెప్పారు. మూడురోజుల పాటు చికెన్ షాపులు బంద్ చేయించామని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎక్కువ కేసులు నమోదైన ఏరియాల్లో వైద్యశిబిరాలు నిర్వహించాలని వైద్యసిబ్బందిని ఆదేశించారు. అతిసార వ్యాధిగ్రస్తులను ప్రత్యేకంగా మానిటరింగ్ చేయాలని సూచించారు. అతిసారపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తూ ఓవర్‌హెడ్ ట్యాంకులను శుభ్రపరచి కేసులు నమోదైన ఏరియాలో బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం అభ్యుదయ కాలనీలో మర ణించిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారికి అండగా ఉండి ప్రభుత్వం నుంచి నష్టపరిహారాన్ని అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదని అధికారులంతా మీ కోసమే పనిచేస్తున్నారని ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే సంప్రదిం చాలని భరోసా ఇచ్చారు.