- అధికారపక్షాన్ని చీల్చిచెండాడిన చంద్రబాబు
- చెణుకులు, సామెతలతో ఆకట్టుకున్న ప్రసంగాలు
- టీడీపీ శ్రేణుల్లో ఉరకలెత్తిన ఉత్సాహం
- అడ్డుంకులను దాటుకొని వస్తున్న జన ప్రవాహం
- కనిగిరినుంచి మొదలై ఎర్రమంచిలో ముగుస్తూ..
అమరావతి (చైతన్యరథం): ‘రా..కదలి రా’ అంటూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుకు రాష్ట్ర ప్రజలు ఉప్పెనలా కదలివచ్చారు. రాష్ట్రంలో 25పార్లమెంట్ నియోజక వర్గా ల్లో నిర్వహించతలపెట్టిన 25 సభలు నేటి పెను కొండ సభతో ముగుస్తాయి. జనవరి 5న ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కనిగిరిలో ప్రారంభమైన ‘రా… కదలి రా’ సభ మొదలుకొని శనివారం జరిగిన దాచేపల్లి సభవరకు జనం వెల్లువెత్తారు. అధికారపక్షం వైఫల్యాల ను ఎండగట్టడంతోపాటు అధికా రంలోకి వస్తే తాము ఏ చేయబోతున్నామనే భరోసా ఇవ్వడంలో ‘రా..కదలి రా’ సభల ద్వారా చంద్రబాబు సూపర్ సక్సెస్ అయ్యారు.
ఎన్నికలకు నాలుగు నెలల ముందు ప్రారంభించిన సభల్లో గత ఎన్నికల సభలకు భిన్నంగా చంద్రబాబు ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటినుండి రాష్ట్రాన్ని సర్వనా శనం చేసిన తీరును వివరిస్తూనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు నినాదమే లేకుండా చేశారు. ప్రతి సభలోనూ ఇనుమడిరచిన ఉత్సాహంతో ఒక్కో సభలో గంటకు పైగా సభా వేదికంతా కలియతిరుగుతూ చంద్రబాబు చేసిన ప్రసం గాలు ప్రజల్లో ఉత్తేజాన్ని నింపడమే కాదు, సమరోత్సా హాన్నిచ్చాయి. ముఖ్యంగా చంద్రబాబు ప్రసంగాలు కొత్త ఒరవడిలో సాగాయి.
చెణుకులు, సామెతలు, పంచ్ డైలాగ్‌లు
గత చంద్రబాబు ప్రసంగాలకు ‘రా…కదలి రా’ సభలో చేసిన ఉపన్యాసాలకు తేడా కనిపించింది. సభి కుల్లో ఉత్సాహాన్ని నింపుతూ‘తమ్ముళ్లూ మీరే మంటారు?’ అంటూ వారి దగ్గరనుండే సమాధానాలు చెప్పిస్తూ వారిలో స్ఫూర్తిని నింపారు. ముఖ్యంగా ఆయన ప్రసంగా ల్లో చెణుకులు, సామెతులు, పంచ్ డైలాగ్‌ల ధాటికి అధికారపక్షం ఉక్కిరిబిక్కిరైంది. సుమతీ శతకాలు, పురాణాలు, ఇతిహాసాలను కోట్ చేస్తూ వేసిన పంచ్ డైలాగ్‌లకు వైసీపీకి నినాదాలే కరు వయ్యాయి. సిద్ధం అనే స్లోగన్‌తో ప్రజల్లో కెళ్లాలని జగన్ భావించిన తరుణాన్నే మిమ్మల్నీ ఓడిరచడానికి అన్నివర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ ఆ నినాదాన్ని తుత్తునియలు చేశారు.
భీమిలి సిద్ధం సభలో జగన్‌రెడ్డి మాట్లాడుతూ పద్మవ్యూహంలో తాను అభిమన్యుడిని కాదు.. అర్జును డును అంటూ చెప్పగా… నీవు అర్జునుడువు కాదు భస్మాసురుడివి అంటూ ఎద్దేవా చేశారు. అంతటితో ఆగక ప్రజలన నెత్తిన చేయి ఎలా పెట్టాడు… చివరికి జగన్‌రెడ్డి నెత్తిన తానే చేయి పెట్టుకొని భస్మం అయి పోనున్నాడని సోదాహరణంగా వివరించి జగన్‌ను ఆత్మ రక్షణలో పడేశారు. మీబిడ్డను.. మీబిడ్డను.. అని ప్రతి సభలో జగన్ చెబుతూంటే అతను మీ బిడ్డ కాదు క్యాన్సర్ గడ్డ అంటూ చంద్రబాబు చీల్చి చెండాడారు. అనేక రకాలుగా పంచ్ డైలాగ్‌లతో హోరెత్తించారు. తాను విశ్వసనీయతకు మారు పేరు అని, 98శాతం హామీలను అమలు చేశానని జగన్ చెబుతుంటే వాటిని కౌంటర్ చేస్తూ జగన్ ఇచ్చిన హామీలను పెద్ద పెద్ద స్క్రీన్లపై వీడియోల్లో ప్రదర్శించి మద్యపాన నిషేధం అమలు చేశావా? ప్రత్యేక హోదా తెచ్చావా? పోలవరం కట్టా వా? బాబాయి హంతకులను అరెస్ట్ చేశావా? అంటూ చంద్రబాబు సంధించిన ప్రశ్నలు ప్రజలందర్నీ అలోచిం చేలా చేశాయి, అధికారపక్షాన్ని నోరెత్తకుండా చేశాయి.
స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలు
జగన్‌రెడ్డి సిద్ధం పేరుతో ఇప్పటికి మూడు ప్రాంతాల్లో మూడు సభలు నిర్వహించారు. చుట్టుపక్కల ఉన్న ఐదారు జిల్లాల నుండి ప్రజలను భయపెట్టి, ప్రలోభపెట్టి తరలించారు. ప్రభుత్వ యంత్రాంగాన్నంతా వాడారు. కానీ సభలు మాత్రం వెలవెలపోయాయి. సభలు జరుగు తుండగానే ఇష్టంలేకుండా వచ్చిన జనం జారుకున్నారు. కానీ ‘రా…కదలి రా’ సభలకు జనం స్వచ్చందంగా తరలివచ్చారు. ప్రభుత్వం బస్సులు ఇవ్వకపోయినా ఎవరి వాహానాలను వారే ఏర్పాటు చేసుకొని తరలివచ్చారు. ఐదారు జిల్లాలకు కలిపి నిర్వహించిన సిద్దం సభల కన్నా ఒక పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరిగిన ‘రా..కదలి రా’ సభలకే ఎక్కువమంది ప్రజలు తరలివచ్చారు. వచ్చినవారు సభ పూర్తయ్యేవంత వరకు సావధానంగా ఉపన్యాసాలన్నీ విన్నారు. చంద్రబాబు ఇచ్చిన స్ఫూర్తి, ఉత్సాహంతో తిరిగి వెళ్లిపోయారు. సభల్లో చంద్రబాబు చేసిన ప్రసంగాల సారంశాన్నే తమ తమ గ్రామాల్లో ప్రజల మధ్య ప్రచారంలో పెడుతున్నారు.
మొత్తంగా చూస్తే ’రా…కదలి రా’ సభలు అధికార పక్ష వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు టీడీపీ`జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేయబోయే పనుల గురించి ప్రజల్లో చైతన్యాన్ని నింపడంలో సూపర్ సక్సెస్ అయ్యాయి. ప్రజలు ఈ సభల ద్వారా ఉత్సాహం ఉరకలు వేస్తున్న కొత్త చంద్రబాబును చూశారు. ఇదే చైతన్యాన్ని, స్ఫూర్తిని ప్రజల్లో మరింతగా నింపేందుకు, మీకు అండగా నేనున్నానని మరింత భరోసా ఇచ్చేందుకు ఈనెల 6వ తేదీ నుండి చంద్రబాబు వినూత్నంగా ’ప్రజాగళం’ యాత్ర చేపట్టబోతున్నారు. మొదటి విడతలో పది పార్లమెంటరీ నియోజకవర్గాల్లోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర చేపడతారు. ప్రజల నుండి సమస్యలపై పత్రాను స్వీకరించి అధికారంలోకి రాగానే వాటిని సత్వరమే పరిష్కరిస్తామని భరోసా ఇవ్వనున్నారు.
స్థానిక అంశాలకు ప్రాధాన్యత
గతంలో చంద్రబాబు ప్రసంగాలు అధికంగా రాష్ట్ర స్థాయి సమస్యలను ఎలుగెత్తి చాటేలా, ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అక్రమాలు, అన్యాయలను తూర్పారపట్టేలా సాగాయి. కానీ ‘రా..కదలి రా’ సభల్లో మాత్రం చంద్ర బాబు ఒరవడి మార్చారు. ఒకవైపున వైసీపీ ప్రభుత్వ అవినీతి, అసమర్ధతను ఎండగడుతూనే స్థానిక సమస్య లను వెలుగులోకి తెచ్చారు. స్థానికంగా వైసీపీ నేతలు చేస్తున్న దోపీడీని వివరించారు. తమ ప్రభుత్వం అధికా రంలోకి వస్తే స్థానికంగా ఉన్న సమస్యలను ఎలా పరి ష్కరిస్తామో సోదాహరణంగా వివరించారు. ఈ ఒరవడి లో సాగిన ఉపన్యాసాలు ప్రజలను విశేషంగా అకట్టు కున్నాయి. ఆయా అంశాలను చంద్రబాబు ప్రస్తావించి నప్పుడు సభికుల నుండి పెద్ద ఎత్తున స్పందన లభిం చింది. దాచేపల్లి సభలో చంద్రబాబు మాట్లాడుతూ పల్నాడులో వైసీపీ చిన్న సైకోల అరాచకాలకు అడ్డు కుంటున్న తెలుగు తమ్ముళ్లకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. టీడీపీ` జనసేన పొత్తును కూడా చంద్రబాబు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. చంద్రబాబు సభలకు జనసైనికులు కూడా పెద్దఎత్తున తరలివచ్చారు. పుసుపు, తెలుపు జెండాల రెపరెపలతో సభా ప్రాంగాణాలు తళతళలాడాయి. టీడీపీ` జనసేన పొత్తు పెట్టుకోగానే వైసీపీ నేతలకు ఫ్యాంట్లు తడిచిపోయాయంటూ చంద్రబాబు చేసిన ప్రసంగాలకు సభికుల నుండి పెద్దఎత్తున స్పందన లభించింది. ఇప్పటి వరకు 24 సభల్లో మాట్లాడిన చంద్రబాబు ఏ సభకు, ఆ సభకు ప్రసంగం ప్రత్యేకంగా ఉండేలా చూసుకున్నారు. ఆరోజు నాటి రాజకీయ పరిణామాలపై తమ వైఖరిని ప్రకటిస్తూ అధికార పక్షాన్ని ఇరాకటంలో పెట్టారు. శనివారం కనపర్తిపాడు, దాచేపల్లి సభల్లో మాట్లాడుతూ బాబాయిని చంపిందేవరో చెప్పాలంటూ చేసిన ప్రసంగం ప్రజల్లోకి సూటిగా వెళ్లింది.