విశాఖపట్నం: అగ్ని ప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్యకారులకు 100 శాతం నష్టపరిహారం చెల్లించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. మత్స్యకారులకు ఇంత నష్టం జరిగినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవటం బాధాకరమన్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో దగ్ఘమైన బోట్లను సోమవారం పార్టీ నాయకలతో కలిసి కొల్లు సందర్శించారు. ఈ సందర్భంగా కొల్లు మాట్లాడుతూ ఇంత పెద్ద ప్రమాదం జరిగితే తక్షణ సాయం ప్రకటించకపోవడం ఎక్కడా చూడలేదన్నారు. 39 బోట్లు దగ్ధం కావడం ఫిషింగ్ హార్బర్ చరిత్రలో ఎప్పుడూ లేదన్నారు. కొత్త ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తామని జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారు…అదే సమయంలో రాష్ట్రంలోని పాత హార్బర్లకు రక్షణ కరవైందని విమర్శించారు. బాధితులకు రావాల్సిన నష్టపరిహారం పై అవసరమైతే న్యాయపోరాటం చేస్తామన్నారు.