- జగన్ ప్రభుత్వంలో వారికి డబ్బు ఇవ్వలేదు
- ఫలితంగా వారు సాగుచేసుకుంటూ నష్టపోయారు
- అధికారులు వారికి కూడా న్యాయం చేయాలి
- పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జి వర్మ ఆదేశం
పిఠాపురం(చైతన్యరథం): ఏలేరు వరదల్లో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం రాయ కుంటే గ్రామ సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్‌కు తెలియజేయాలని, లేని పక్షంలో తమ పార్టీ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే, పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జి వర్మ రైతులకు సూచించారు. అదేవిధంగా దెబ్బతిన్న ఇళ్లు, పూర్తిగా మునిగిన ఇళ్లు, ఎక్కడైనా గేదెలు చనిపోయి నష్టపోతే అక్కడి సచివాలయం లేదా తహసీల్దారుకు ఫోన్ చేసి చెప్పడం, ఏమైనా రాయకపోయి ఉన్నా సరే ఆ వివరాలు కూడా తెలియజేయాల్సిన అవస రం ఉందని వివరించారు. కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలన్న ఒక్క ఆలోచనతో పనిచేస్తుందన్నారు. ఏలేరు ఆధునికీకరణ కోసం తీసుకున్న భూమి ఏదైతే ఉందో వాటికి సంబంధించి కూడా నష్టపరిహారం రాయాల్సిన అవసరం ఉందని సూచించారు. వైసీపీ ప్రభుత్వంలో డబ్బులు ఇవ్వకపోవడం వల్ల వారి భూములు సాగు చేసుకుంటున్నారని, కానీ రెవెన్యూ రికార్డులో దాన్ని ప్రభుత్వ భూమిగా నమోదు చేయడం వల్ల నష్టపరిహారం రాయ టం లేదని తమ దృష్టికి వచ్చినట్టు చెప్పారు. దీనిమీద తహసీల్దారు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నట్టు వివరించారు. ముఖ్యంగా జమునపల్లి, గోకవాడ, రాపర్తి గ్రామాల్లో ఇటువంటి ఘటన లు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటా మని చెప్పారు.