- అవకాశమిస్తే అభివృద్ధికి కేరాఫ్‌గా మార్చి చూపిస్తా.
- ముఖ్యమంత్రి ఇంటి సమీపంలోనే గంజాయి ముఠాలు
- తాడేపల్లి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్
మంగళగిరి, చైతన్యరథం: గత ఎన్నికల సమయం లో 21రోజుల ముందు మంగళగిరిలో పోటీచేసి ఓడి పోయా, ఇక్కడి ప్రజల మనసులను గెలవాలనే ఉద్దేశం తోనే ఓడినా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని సేవలం దిస్తున్నానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్ని కల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజక వర్గం తాడేపల్లి వజ్ర రెసిడెన్సీ వాసులతో యువనేత ఆదివా రం సమావేశమయ్యారు.ఈసందర్భంగా లోకేష్ మాట్లా డుతూ…అయిదేళ్లుగా సొంతగా 29సంక్షేమ కార్యక్ర మాలు అమలు చేస్తున్నా. తనను గెలిపిస్తే అభి వృద్ధి, సంక్షేమం పేరు చెబితే మంగళగిరి గుర్తుకు వచ్చేలా పనిచేస్తా.అయిదేళ్లలో ప్రణాళికాబద్ధంగా కృషిచేసి అన్ని సమస్యలను పరిష్కరిస్తా. అవాంతరాలు సృష్టించడం ద్వారా పోలింగ్ ప్రక్రియను జాప్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. మంగళగిరి ప్రజలు అప్రమత్తంగా ఉం డి ఈ ఎన్నికల్లో ఓర్పు, సహనంతో తమ ఓటు హక్కు ను వినియోగించుకోవాలి.
వందరోజుల్లో గంజాయి ముఠాలకు చెక్!
ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో గంజాయి ముఠా లు పేట్రేగిపోతున్నా స్పందన లేదు. ఒక వ్యక్తి హత్యకు కూడా గురయ్యాడు. తాడేపల్లి ఎన్టీఆర్ కట్ట వద్ద ఓతల్లి తమ బిడ్డలు గంజాయికి బానిసలయ్యారని తెలిపింది. యువగళం పాదయాత్ర సందర్భంగా చిత్తూరు జిల్లా చంద్రగిరిలో కూడా ఓ తల్లి తమ బిడ్డ గంజాయి బాని సగా మారారని చెప్పింది. గంజాయి కారణంగా ఒక తరం నాశనమవుతుంది. అందుకే అధికారంలోకి వచ్చి న 100రోజుల్లో గంజాయిని సమూలంగా నిర్మూలించా లని నిర్ణయించాం. చంద్రబాబుగారు సిఎంగా ఉన్నపు డు పత్రికల్లో ప్రతిరోజూ పరిశ్రమలు వస్తున్నట్లు వార్త లు వచ్చేవి.జగన్ ప్రభుత్వం వచ్చాక మర్డర్లు,డ్రగ్స్, గం జాయి,ఆత్మహత్యల వార్తలువస్తున్నాయి. ఈ పరిస్థితిని సమూలంగా మార్చేసి రాష్ట్రాన్ని తిరిగిగాడిలో పెడతాం.
కరకట్ట కమల్ సినీ హీరోలను మించిపోయారు
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే నటించడంలో బాలయ్య, పవన్‌లను మించిపోయారు. అందుకే ఆయనకు కర కట్ట కమలహాసన్ అని పేరుపెట్టా. ఆరునెలల క్రితం జగన్ మంగళగిరి అభివృద్ధికి నిధులు ఇవ్వలేదు, ఇళ్లు కట్టలేదు, అందుకే రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ప్యాకేజి కుదరగానే మళ్లీ నటన మొదలుపెట్టారు. పదే ళ్లుగా మంగళగిరిలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కృష్ణానది పక్కనే ఉన్నా ఇక్కడి ప్రజలకు తాగునీరు లేకపోవడం సిగ్గుచేటు.నియోజకవర్గంలోని వివిధ ప్రాం తాలు డ్రైనేజీలు లేక మూసీకాల్వల్లా తయారవుతున్నా యి. తాను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత రాబోయే 20సంవత్సరాలకు సరిపడా ప్రణాళికలను సిద్ధంచేసి తాగునీరు, భూగర్భ డ్రైనేజి, పార్కులు, రోడ్లు, శ్మశాన వాటికలను నిర్మిస్తాం. బ్లాక్ డెవలప్ మెంట్ మోడల్‌తో అభివృద్ధి పనులు చేపడతాం. అందరితో చర్చించి మం గళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌పై సముచిత మైన నిర్ణయం తీసుకుంటాం.తాడేపల్లి మున్సిపాలిటిలో విపరీతంగా మోపిన పన్నుల భారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటాం. 30వేలకు పైగా ఉన్న స్వర్ణకారు ల ఉపాధి కల్పించేందుకు ఈ ప్రాంతంలో ప్రత్యేక సెజ్ ఏర్పాటుచేసి గోల్డెన్ హబ్‌గా తీర్చి దిద్దుతాం. అధునా తన డిజైన్లకు అవసరమైన శిక్షణ,మార్కెటింగ్ సౌకర్యా లు కల్పించి చేనేతలను చేయూతనిస్తాం. ఆటోనగర్‌లో పరిశ్రమలు రప్పించి ఉద్యోగావ కాశాలు కల్పిస్తాం.
డబ్బు కోసమైతే రాజకీయాలు అవసరం లేదు
కేవలం డబ్బు కోసమే అయితే తనకు రాజకీయా ల్లోకి రావాల్సిన అవసరం లేదని లోకేష్ చెప్పారు. స్టాన్ ఫోర్డ్ లో చదివిన నేను వరల్డ్ బ్యాంకులో ఉద్యోగం చేశా. హెరిటేజ్ ఈడిగా వ్యవహరించిన సమయంలో 600కోట్లు ఉన్న టర్నోవర్‌ను 1500కోట్లకు పెంచాను. అనునిత్యం రాష్ట్రం కోసం తపన పడే చంద్రబాబుని తప్పుడు ఆరోపణలతో 53రోజులు జైలులో పెట్టారు. రాష్ట్రానికి పరిశ్రమలు, ఉద్యోగాలు తేవడమే ఆయన చేసిన తప్పా? ఆ సమయంలో మనకు రాజకీయాలు అవసరమా అని బ్రాహ్మణి అడిగింది. అయితే చంద్ర బాబు అరెస్టు తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చిన స్పం దన చూశాక ప్రజలు మా వెంటే ఉన్నారని అర్థమైంది. జైలుకెళ్లినా 5కోట్ల మంది ప్రజల బలమే ఆయనకు, మాకు కొండంత ధైర్యాన్నిచ్చింది.