అమరావతి,చైతన్యరథం: కర్నూల్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో గ్రీన్కో సంస్థ పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిరదని, అటవీ భూములను ఆక్రమించిందని ఫిర్యాదుల రావడంతో వాటిపై నివేదిక ఇవ్వాలని అటవీ, పర్యావరణ శాఖ అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు. గురువారం కల్లా నివేదికను సిద్దం చేసుకోవాలని రావాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పారిశ్రామిక కాలుష్యంపై పొల్యూషన్ ఆడిట్ నివేదిక ఇవ్వాలని కాలుష్య నియంత్రణ మండలికి ఆదేశాలు ఇచ్చారు. పొల్యూషన్ ఆడిట్‌పై ఈరోజు సమీక్ష నిర్వహించనున్నారు.