భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ మినీ మ్యానిఫెస్టో
నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు పెద్దపీట
బీసీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
టీడీపీ ప్రకటించిన మేనిఫొస్టోలోని 6 ప్రత్యేక పథకాలు, జగన్ ప్రభుత్వంలో వాటి పరిస్థితి ఇప్పుడు చూద్దాం.
1) పేదలను ధనవంతులు చేయడం
పూర్ టూ రిచ్ అని దీనికి పేరుపెట్టారు. ఐదేళ్ళలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని టీడీపీ పేర్కొంది.
(వైసీపీలో ఇలాంటి పథకం లేదు)
2) బీసీలకు రక్షణ చట్టం
బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారికి అన్ని విధాలా అండగా నిలుస్తానని టీడీపీ ప్రకటించింది.
(వైఎస్సార్సీపీ హయాంలో 26 మందికి పైగా బీసీలు హత్యకు గురయ్యారు. 650 మంది నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు. ముస్లిం మైనార్టీలపై 43 దాడులు జరిగాయి. వీటిలో దృష్టిలో పెట్టుకుని టీడీపీ బీసీలకు రక్షణ చట్టాన్ని కల్పించాలని నిర్ణయించింది
-వైఎస్ఆర్ కాపు నేస్తం కింద.. కాపు,బలిజ, తెలగ వర్గాలకు రూ.15వేల వంతన ఐదేళ్లలో రూ.75వేల సాయం.
– వైఎస్ఆర్ చేయూత పేరుతో.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు సాయం. ఈ పథకం కింద ఒక్కో కుటుంబంలోని మహిళకు ఏడాదికి రూ.18,750 వంతున నాలుగేళ్లుగా రూ.75వేల సాయం
-జగనన్న చేదోడు.. సొంత షాపు ఉన్న రజకులు, నాయీబ్రాహ్మణులకు, దర్బీలకు ఏటా రూ.10వేల సాయం
3. ఇంటింటికీ తాగునీరు
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే “ఇంటింటికీ మంచి నీరు” పథకం కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇస్తామని పేర్కొంది.
(జగన్ పాలనలో ఇలాంటి పథకం లేదు)
4) అన్నదాత
ప్రతి రైతుకు ఏడాదికి 20వేల రూపాయల ఆర్థిక సాయం.
(వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో పీఎంకిసాన్ పథకం కింద ఇచ్చే 6వేలతో కలిపి మూడు వాయిదాల్లో ఏడాదికి రూ.13,500 సాయం.
భూమిలేని ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ కౌలురైతులకూ సాయం)
5) మహిళా `మహా శక్తి`
మహిళా ఓటర్ల కోసం ప్రత్యేకంగా మహిళా మహా శక్తి పథకం
ప్రతి కుటుంబంలో 18 ఏళ్ళు నిండిన మహిళలకు “స్త్రీనిధి” కింద నెలకు 1500 రూపాయలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ
వైసీపీ హయాంలో మహిళా స్వయం సహాయక బృందాలకు సున్నా వడ్డీకి రుణాలు. బ్యాంకు ఎక్కౌంట్లలో రూ. ఐదు లక్షల వరకూ ఉండే మహిళలు ఈ పథకం కింద ప్రయోజం పొందుతారు.
‘తల్లికి వందనం’ పథకం కింద ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15 వేల సాయం
(జగనన్న అమ్మఒడి.. ప్రభుత్వ, ప్రయివేటు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి చదివే విద్యార్థుల తల్లులు లేదా సంరక్షకులకు
ఏడాదికి రూ.15వేల సాయ
60 ఏళ్లు దాటిన వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, డప్పు కళాకారులు, హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధితులు, కుష్ఠు వ్యాధిగ్రస్తులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నవారికి నెలవారీ పెన్షన్లు అందించేందుకు ఈ పథకం పెట్టారు.
కేటగిరినీ బట్టి రూ.2250 నుంచి రూ.10వేల వరకూ పెన్షన్ ఇస్తారు.
“దీపం” పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు
స్థానిక బస్సుల్లో మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం
(వైసీపీ హయాంలో కుటుంబానికి మూడు గ్యాసు సిలెండర్లు, ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు కావటం లేదు)
6) యువగళం
1. ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు
2. ప్రతి నిరుద్యోగికి ‘యువగళం నిధి’ కింద నెలకు రూ. మూడు వేల ఆర్థిక సాయం
(టీడీపీ హయాంలో అమలులో ఉన్న నిరుద్యోగభృతిని జగన్ ప్రభుత్వం రద్దు చేసింది.
2లక్షల 30వేల ఉద్యోగాలను భర్తీ చేస్తానని చెప్పి జగన్ అధికారంలోకి వచ్చారు.
ప్రభుత్వఉద్యోగాలు లేవు. దానితోపాటు ఇక్కడకు రావలసిన పరిశ్రమలన్నీ తరలిపోవటంతో ప్రయివేటు ఉద్యోగాలు కూడా లేవు.
రాష్ట్ర్రంలో 21,750 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అమరావతి నిర్మాణం ద్వారా 15 లక్షల ఉద్యోగాలకు టీడీపీ శ్రీకారం చుడితే,
దానిని జగన్ ప్రభుత్వం నేలరాసింది,)