టిడిపి అధికారంలోకి రాగానే పాణ్యం నియోజకవర్గంలో ఎస్సీ సంక్షేమ హాస్టల్ నిర్మాణానికి చర్యలు చేపడతామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర సందర్భంగా గురువారం పాణ్యం నియోజకవర్గం పుసులూరు గ్రామ దళితులు యువనేతను లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.
గత ప్రభుత్వంలో అమలుచేసిన 27 ఎస్సీ సంక్షేమ పథకాలను జగన్ అధికారంలోకి వచ్చాక రద్దుచేశారు.
ఎస్సీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.
చట్టసభల్లో అత్యున్నత పదవులు ఇవ్వాలి.
కల్లూరు మండలంలో ఎస్సీ హాస్టల్ నిర్మించాలి.
పాణ్యం నియోజకవర్గంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మించాలి.
గ్రామంలో వాటర్ ట్యాంకు, ఎస్సీ కాలనీలో ప్రత్యేక వాటర్ పైప్ లైన్ ఏర్పాటుచేయాలి.
గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
దళితులకు గత ప్రభుత్వం అమలు చేసిన 27 సంక్షేమ పథకాలు రద్దుచేయడమేగాక, రూ.28,147కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన దళిత ద్రోహి జగన్ రెడ్డి.
దళితుల ఓట్లతో ముఖ్యమంత్రి అయిన జగన్ అధికారంలోకి వచ్చాక మోసగించారు.
టిడిపి అధికారంలోకి వచ్చాక గతంలో అమలుచేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తాం.
ప్రతియేటా జాబ్ క్యాలెండర్ ద్వారా యువతకు ఉద్యోగాలు ఇస్తాం.
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ లోన్లు ఇచ్చి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.
దళితులను లోక్ సభ, శాసనసభ స్పీకర్లను చేసిన ఘనత చంద్రబాబుది. రాజకీయంగా ప్రాధాన్యతనిస్తాం.
పుసులూరు గ్రామంలో వాటర్ ట్యాంక్, వాటర్ లైన్, అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.