- ఆర్‌అండ్‌బీ అధికారులకు మంత్రి బి.సి.జనార్దన్‌రెడ్డి
- వరదలు తగ్గే వరకు సెలవులు రద్దు చేస్తున్నట్టు వెల్లడి
- రోడ్లు, భవనాలకు నష్టం వాటిల్లితే సమాచారం ఇవ్వాలి
- ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదని ఆదేశం
అమరావతి(చైతన్యరథం): వరద ప్రభావిత ప్రాంతాల్లో రహదారులు, భవనాల సంరక్షణ విషయంలో ఆర్‌అండ్‌బీ అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు భవనా లు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలశాఖ మంత్రి బి.సి.జనార్దన్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో వరద ప్రభావిత కృష్ణా, గుంటూరు, పల్నాడు, పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించిన ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈలు, ఈఈలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులు ఈఎన్‌సీ, సీఈలు పాల్గొన్నారు. ఆయా జిల్లాల్లో వరదలు, రోడ్లు, భవనాల పరిస్థితులపై అధికారులను ఆరా తీశారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం సుమారు 2,000 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని, వాటిని యుద్ధప్రాతిపదికన నిర్మించేందుకు చర్యలు చేప ట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
వరద ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా తక్షణమే మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. రహదారులు, భవనాలకు ఎటువంటి నష్టం వాటిల్లినా వాటిని వెంటనే ఆర్‌అండ్‌బీ ప్రధాన కార్యాలయం, కంట్రోల్ రూమ్‌కు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. ముఖ్యంగా బ్రిడ్జిలు దెబ్బతిన్న ప్రదేశాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులు వెంటనే ఏర్పాటు చేయాలని, ఎలాంటి ప్రమాదాలకు అవకాశం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో వరదలు తగ్గుముఖం పట్టే వరకు ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులకు సెలవులు రద్దు చేశామని తెలిపారు. జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండా లని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్క రించాలని ఆదేశించారు.