- యువత ఓట్ల కోసమే ఆడుదాం ఆంధ్ర పేరుతో జగన్ రెడ్డి డ్రామాలు
- ఆడుదాం ఆంధ్రా కాదు.. జగన్ చేతుల్లోంచి నుంచి ఆంధ్రని కాపాడుదాం
- మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు ధ్వజం
అమరావతి: యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసి యువత జీవితాలతో ఆడుకుంటున్న సీఎం జగన్‌రెడ్డి ఎన్నికల ముందు యువత ఓట్ల కోసం‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో డ్రామాలాడుతున్నారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి రాష్ట్రంలో ఉద్యోగాలకు నోటిఫకేషన్లు లేవు, కొత్తగా పరిశ్రమలు పెట్టుబడులు రాలేదని ఒక ప్రకటనలో మంతెన ధ్వజమెత్తారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పన లేనందున నిరుద్యోగ యువత ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందుకే కంటి తుడుపు చర్యగా ‘ఆడుదాం ఆంధ్ర’కు శ్రీకారం చుట్టింది.
తప్పుడు రిజిష్ట్రేషన్లతో క్రీడలు నిర్వహించినట్టు, విజేతల్ని ప్రకటించినట్టు కాగితాలపై చూపారు తప్ప, వాస్తవంగా చాలా చోట్ల అసలు క్రీడలే నిర్వహించలేదు. క్రీడలు నిర్వహించిన చోట క్రీడాకారులకు కనీసం తాగునీరు,భోజన సదుపాయాలు కూడా కల్పించలేదు, మరి రూ.120కోట్లు ఏం చేశారు? నాణ్యత లేని కిట్లు సరఫరాచేసి వాటిలోనూ బొక్కేశారు. టీడీపీ ప్రభుత్వం 5ఏళ్లలో క్రీడారంగా నికి రూ.1139 కోట్లు ఖర్చుచేస్తే… వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో కేవలం రూ.814 కోట్లే ఖర్చు చేసింది. 2022-23లో కేవలం రూ.75కోట్లు కేటా యించారు, కానీ అందులో రూ.58కోట్లు జీత భత్యాలకే ఖర్చు చేశారు. క్రీడా సంఘాలకు ఇవ్వాల్సిన గ్రాంట్లు, ఒలంపిక్స్ అసోషియేషన్‌కి ఇవ్వా ల్సిన బకాయిల గురించి పట్టించుకోవటం లేదు. ఐదేళ్ల్లుగా క్రీడా రంగాన్ని భ్రష్టు పట్టించారు. పేద క్రీడాకారులకు ఉచితంగా అందు బాటులో ఉండే ప్రభుత్వ స్టేడియాలను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేటు వ్యక్తులకు లీజుకు కట్టబెట్టారు.
శిక్షణ కోసం వచ్చేవారి నుంచి రూ.50 నుంచి రూ.1000వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. దీంతో పేద క్రీడా కారులు స్టేడియాలకు రావటమే మానేశారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023 లో అత్యధిక పధకాలు సాధించిన మొదటి 10రాష్ట్రాల్లో అసలు ఏపీకి చోటే దక్కలేదు. చిన్న రాష్ట్రం మణిపూర్ సైతం 10వ స్థానం సాధిస్తే ఏపీ మాత్రం 13వ స్ధానానికి పరిమితమైంది. టీడీపీ హయాంలో గ్రామ స్థాయిలో క్రీడాకారుల్ని ప్రోత్సహించేందుకు మండల, నియోజకవర్గ కేంద్రాల్లో రూ. 50 లక్షల నుంచి కోటి వరకు కేటాయించి క్రీడా వికాస కేంద్రాలు ఏర్పాటు చేస్తే జగన్‌రెడ్డి వాటిని నిర్వీర్యంచేశారు. దాదాపు 20, 010 ప్రభుత్వ పాఠశాలల్లో ఆట స్థలాలు లేవు, వందలాది పాఠశాలల్లో పీఈటీ మాస్టార్లు లేరు. కొత్తగా ఒక్కరినీ కూడా నియమించలేదు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆడిన క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహంలేదు.పుట్‌బాల్‌కి, వాలీ బాల్కి తేడాతెలియని రోజాకు క్రీడాశాఖ కట్టబెట్టారు, ఏసీఏ(ఆంధ్రా క్రికెట్ అసోషియేషన్)అధ్యక్షునిగా ఢల్లీి లిక్కర్ స్కాంలో నిందితునిగా ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డిని నియమించారు.
2019లో ఏసీఏ కి రూ.120కోట్ల వరకు ఫిక్స్డ్ డిఫాజిట్లు ఉండేవి, విజయసాయిరెడ్డి, ఆయన బందుగణం ఏఏసీను చేతుల్లోకి ఆ బ్యాంక్ ఖాతాలో కేవలం రూ.20 కోట్లే మిగిలాయి. ఇతర బ్యాంకులకు ఎప్డీలు మార్చితద్వారా తమ వ్యాపారాలకు రుణాలు పొందేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. శాప్‌ని అవినీతికి నిల యంగా మార్చారు,టెండర్లలో ఎండీ అవినీతికి పాల్పడ్డారని శాప్్ డైరక్టర్లే బహి రంగంగా ఆరోపించారు. లక్షలాది రూపాయలు లంచాలు తీసుకుని అర్హత లేనివారికి స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ వన్ ఉద్యోగాలకు సర్టిఫికెట్లు ఇచ్చారు. అనం తపురం జిల్లా ధర్మవరంలో జూనియర్ హాకీ క్రీడాకారిణి దళిత యువతి స్నేహ లత అత్యాచారానికి గురైతే నిందితులపై చర్యలుశూన్యమని మంతెన మండిపడ్డారు.
టీడీపీ హయాంలో
టీడీపీ ప్రభుత్వం, శాప్, ఒలింపిక్, క్రీడా సంఘాలు కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి బాటలువేశాయి. చంద్రబాబునాయుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా,నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రపంచ ప్రఖ్యాత క్రీడా కారులను తయారుచేసి,రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్ తీర్చిదిద్దేందుకు కృషి చేశారు. మంగళగిరిలో 24 ఎకరాల్లో 34,000 సీటింగ్ సామర్థ్యంతో అంతర్జాతీయ స్టేడియం నిర్మాణానికి శ్రీకారంచుట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదలతో 2002లో హైదరాబాద్, విశాఖపట్నం కేంద్రంగా జాతీయ క్రీడలు,2003లో ఆఫ్రో ఆసియా క్రీడలకు ఆతిథ్యమిచ్చిన ఘనమైన చరిత్ర ఆంధ్రప్రదేశ్‌కి ఉంది. చంద్రబాబు నాయుడు ఉప్పల్, గచ్చిబౌలి, సరూర్ నగర్ క్రికెట్ స్టేడియాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
చంద్రబాబు నాయుడు ఎల్బీ స్టేడియంలో టెన్నిస్ కోర్టు నిర్మాణం చేపట్టి టెన్నిస్ క్రీడకు ప్రోత్సాహం అందించా రు. చంద్రబాబు ఇచ్చిన ప్రోత్సాహంతో కరణం మల్లీశ్వరి, పుల్లెల గోపీచంద్, కోనేరు హంపి,పీవీ సింధు వంటివారు తమ ప్రతిభతో ఆంధ్రప్రదేశ్ పేరును విశ్వవ్యాప్తం చేశారు. చంద్రబాబునాయుడు పుల్లెల గోపిచంద్ అకాడ మికి హైదారాబాద్ (2003)లో 5ఎకరాలు, అమరావతి 2017లో 12ఎకరాలు కేటా యించారు. కానీ నేడు జగన్‌రెడ్డి క్రీడారంగాన్ని నిర్వీ ర్వంచేసి కేవలం ఓట్లకోసం ఆడుదాం ఆంధ్ర పేరుతో ఆడుతున్న డ్రామాను యువత గమ నిస్తున్నారు. అందు కే జగన్‌రెడ్డి చేతుల్లోనుంచి ఆంధ్రని కాపాడుదాం అం టూ నినదిస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో జగన్‌రెడ్డిని చిత్తుగా ఓడిరచి తగిన గుణపాఠం చెప్పేందేందుకు యువత అంతా సిద్దంగా ఉన్నారని మంతెన స్పష్టం చేశారు.