- పంటల కొనుగోళ్లలో భారీ అవకతవకలు
- గోనెసంచుల పంపిణీలోనూ కోట్లు దండుకున్నారు
- ముఖ్యమంత్రి సలహాదారు అంబటి కృష్ణారెడ్డి
కడప : మార్క్ ఫెడ్ వేదికగా జరిగిన అవినీతిపై టీవీ5 ప్రసారం చేసిన కథనం వాస్తవమేనని సీఎం వ్యవసాయ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శనగలు, పసుపు, వరిపంట కొనుగోళ్లలో భారీగా అవినీతి జరిగిన మాట వాస్తవమేనని అంగీకరిం చారు. క్వింటాళ్ల చొప్పున కమీషన్లు, గోనె సంచుల పంపిణీలో నాయకులు కోట్లు దండుకుని రైతులకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. మార్క్ ఫెడ్ కొనుగోళ్లలో హమాలీల కూలీడబ్బునూ కాజేశారని తెలిపారు. మార్క్ ఫెడ్ అవినీతిపై సీఐడీకి ఫిర్యాదు చేస్తానని అంబటి కృష్ణారెడ్డి పేర్కొన్నారు.