- గిరిజనుల స్ఫూర్తిపై మంత్రి లోకేష్ హర్షం
- తక్షణం పక్కా భవనం నిర్మాణానికి ఆదేశం
అమరావతి: ఏజెన్సీ ప్రాంత గిరిజనులు తమ శక్తి మేరకు తమ పిల్లలు చదువుకునే పాఠశాల కోసం ఒక పాకను నిర్మించుకోవటంపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. తక్షణం ఆ పాఠశాలకు పక్కా భవనం నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఎక్స్‌లో ఆ విషయాన్ని లోకేష్ పంచుకున్నారు.
అల్లూరి జిల్లా మన్యం ప్రాంతంలో ముంచింగిపుట్టు పరిధి కిండుగూడాలో గిరిజనులు శ్రమదానంతో తమ పిల్లల పాఠశాల కోసం ఓ పాక నిర్మించుకున్నారు. సోషల్ మీడియాలో పవన్ అనే జర్నలిస్టు దీనిని షేర్ చేశారు. ఇది నా దృష్టికి వచ్చింది. తక్షణమే కిండుగూడాలో పాఠశాలకు ఓ పక్కా భవనాన్ని నిర్మించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాను. తమ పిల్లలకు విద్యను అందించే బడి కోసం గిరిజనులు చేసిన కృషి అభినందనీయం. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన జర్నలిస్టు పవన్‌కి ధన్యవాదాలు అని లోకేష్ ట్వీట్ చేశారు.