- వినిపించే అబద్ధాలు కాదు, కనిపించే నిజాలు నమ్మండి
- ‘ఎక్స’ పోస్టులో వైస్ చైర్మన్, ఎండి నారా భువన్వేశ్వరి
- వాస్తవాలు గ్రహించాలంటూ హెరిటేజ్ విజన్‌పై వీడియో
అమరావతి (చైతన్య రథం): 33 ఏళ్లుగా ప్రతి ఇంటికీ తాజా, ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులు అందిస్తూ, ప్రతి పాడి రైతుకూ సాధికారత కల్పించడమే హెరిటేజ్ లక్ష్యమని హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. రైతుల సాధికారత, పారదర్శకతకు తమ సంస్థ కషి చేస్తోందని స్పష్టం చేశారు. ఈమేరకు సామాజిక మాధ్యమం (ఎక్స్)లో గురువారం ట్వీట్ చేసిన భువనేశ్వరి “రూ.4 కోట్ల సంస్థగా ప్రారంభమై రూ.4,000 కోట్ల సంస్థగా ఎదిగినా.. నాణ్యత విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదు. అన్ని ఉత్పత్తులూ 25 నాణ్యత పరీక్షలు దాటిన తర్వాతే.. మీ ఇంటికి చేరుతున్నాయి. 500కి పైగా నిపుణులు ప్రమాణాలను పర్యవేక్షిస్తున్నారు. తొమ్మిది రాష్ట్రాల్లో దాదాపు 3 లక్షలమంది రైతులతో తాము పారదర్శకత, న్యాయమైన ధర, సమయానికి చెల్లింపులు అనే సూత్రాలపై ముందుకు సాగుతున్నాం. నేను విడుదల చేస్తున్న వీడియోను పూర్తిగా వీక్షించి నిజాన్ని మీరే గ్రహించండి. కళ్లతో చూసిందే నమ్మండి” అని పేర్కొన్నారు.
















