అమరావతి: దాడిశెట్టి రాజా ఒక అజ్ఞాని, పేకాట ఆడటం, ఆడించడం తప్ప ఏమీ తెలియదని మాజీ మంత్రి కేఎస్ జవహర్ మండిపడ్డారు. మీడియాకు సోమవారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు. చరిత్ర తెలియని మంత్రులు జగన్ రెడ్డి క్యాబినెట్ లో ఉన్నారని చెప్పారు. దాడిశెట్టి రాజా మాటలను ముఖ్యమంత్రి సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. అన్న నందమూరి తారక రామారావును కించపరుస్తూ మాట్లాడే దాడిశెట్టి రాజా నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. దాడిశెట్టి రాజా తన నోటికి ఏదొస్తే అది మాట్లాడితే ఊరుకోం అని హెచ్చరించారు. నోటిని ఫినాయిల్‌తో శుభ్రం చేసుకోవాలని రాజాకు జవహర్ సలహా ఇచ్చారు. అవాకులు, చవాకులు పేలడం మానాలని చెప్పారు. ఏ ప్రయోజ నాలు ఆశించి మహానేత ఎన్టీఆర్‌ను కించపరుస్తూ మాట్లాడుతున్నారో ప్రజలకు తెలుసని చెప్పారు.
ఎన్టీఆర్, రాజశేఖర్‌రెడ్డిలకు పోలికేంటని ప్రశ్నిం చారు. అసలు పోలిక, సమాన ధర్మం గురించి దాడిశెట్టి రాజాకు తెలుసా అని అడిగారు. ఎన్టీరామా రావుకు ఉన్న ఔన్నత్యం రాజశేఖర్‌రెడ్డికి లేదని స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న ఫ్యాక్షనిస్టు చరిత్ర అన్న నందమూరి తారక రామారావుకు లేదన్నారు. ప్రయోజనాలను ఆశించి మాట్లాడుతున్న దాడిశెట్టి రాజా జగన్ వద్దకు వెళ్లి సాగిలపడాలి లేదా మోకరిల్లాలిగాని అవాకులు, చవాకులు పేలొద్దని హితవు పలికారు. దాడిశెట్టి రాజాకు తన మంత్రిత్వ శాఖపై ఏవిధమైన పట్టు లేదని జవహర్ చెప్పారు.