- ఎస్సీ, ఎస్టీలను మోసగించి కంసమామలా ద్రోహం చేశాడు
- ఉద్యోగాల ప్రమోషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు
- బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయకుండా మోసగించాడు
- ఓవర్సీస్ విద్యానిధి పేరు మార్చి అంబేద్కర్‌ను అవమానించాడు
అమరావతి(చైతన్యరథం): వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాలను తిరిగి పునరుద్ధరిస్తామని రాష్ట్ర సాంఘిక, సంక్షేమ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. గురువారం శాసనసభలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు. టీడీపీ హయాంలో దళితుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రద్దు చేసి జగన్‌రెడ్డి వారి పొట్ట కొట్టారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు కూడా భర్తీ చేయలేదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల కోసం నూతన పారిశ్రామిక విధానం అమలు చేయలేదని విమర్శించారు. బీ,సీ కేటగిరి కింద మెడికల్ సీట్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయలేదన్నారు. అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టం అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు. అట్రాసిటీ కేసుల్లో నిందితులకు 41 సీఆర్‌పీసీ కింద స్టేషన్ బెయిల్ మంజూరు చేశారని అన్నారు. ఎస్సీలకు ఇళ్ల నిర్మాణం కోసం టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన రూ.50 వేల అదనపు ఆర్థిక సహాయాన్ని కూడా నిలిపే శారని వివరించారు. ఉద్యోగాల ప్రమోషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ చట్టం సక్రమంగా అమలు కాలేదు. ఎస్సీ నియోజకవర్గాలకు కేంద్ర బిందువుగా ఉన్న అమరావతి రాజధాని నిర్మాణం నిలిపేశారని పేర్కొన్నారు. దళితులకు మేనమామ అని చెప్పుకునే జగన్ రెడ్డి కంస మామలా మారి వారికి ద్రోహం చేశారని అన్నారు. అందుకే దళితులు తిరగబడి రాష్ట్రంలో వైసీపీని తరిమికొట్టారని అన్నారు.
టీడీపీ హయాంలో దళితులకు మేలు
గత టీడీపీ హయాంలో దళితులకు అన్ని విధాలా మేలు చేశామని వివరించారు. 2014-2019లో ఐఎస్‌బీ సెక్టార్, పశుసంవర్ధక శాఖ కింద బ్యాంకు లింకేజీ రుణాల ద్వారా 60 శాతం సబ్సిడీతో రూ.2716.70 కోట్లతో 2,02,414 మంది ఎస్సీలకు ప్రయో జనం చేకూర్చామని తెలిపారు. భూమిలేని పేదలకు భూమి కొనుగోలు పథకం ద్వారా రూ.197 కోట్లతో 2,518 మందికి 2360.77 ఎకరాల భూమి పంపిణీ చేశామని, ఎన్‌ఎస్ ఎఫ్‌డీసీ కింద రూ.552.55 కోట్లతో 10,634 మంది ఎస్సీ యువతకు ఇన్నోవా కార్లు, రవాణా రంగంలో అధిక విలువ గలిగిన ప్రాజెక్ట్ ఆధారిత యూనిట్లు అందించామన్నారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా ద్వారా రూ.29.39 కోట్లతో 669 మందికి ఢల్లీి, హైదరాబాద్, బెంగళూరు లాంటి మెట్రోపాలిటన్ సిటీల్లో ఉచితంగా సివిల్స్ కోచింగ్ అందించామని తెలిపారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ ద్వారా రూ.165.29 కోట్లతో 23,389 మంది పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించినట్టు వివరించారు. అంబేద్కర్ ఓవర్సీ స్ విద్యానిధి కింద రూ.32.23 కోట్లతో 437 మంది విద్యార్థులకు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కల్పించామని స్పష్టం చేశారు. కానీ జగన్‌రెడ్డి మాత్రం ఆ పథకానికి అంబేద్కర్ పేరు మార్చి తన పేరు పెట్టుకుని అంబేద్కర్‌నే అవమానించారని మం డిపడ్డారు. పేదరికం లేని సమాజమే ధ్యేయంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం పనిచేస్తుం దని, వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాలు త్వరలోనే తిరిగి పునరుద్ధరి స్తామని వివరించారు.