- అంబేద్కర్ విగ్రహం ముసుగులో చేసిన పాపాలను కప్పెట్టుకునే ఎత్తుగడ
- జగన్ పాలనలో దళితులపై దారుణమైన దమనకాండ
- దళిత జాతికి చరిత్రలో ఎన్నడూ లేని నష్టం
- సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లించి అభివృద్ధికి, సంక్షేమానికి తూట్లు
- 28కి పైగా సంక్షేమ పథకాలు రద్దు
- నక్కా ఆనంద్‌బాబు బహిరంగ లేఖ
- అంబేద్కర్ విగ్రహం ముసుగులో చేసిన పాపాలను కప్పెట్టుకునే ఎత్తుగడ
- జగన్ పాలనలో దళితులపై దారుణమైన దమనకాండ
- దళిత జాతికి చరిత్రలో ఎన్నడూ లేని నష్టం
- సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లించి అభివృద్ధికి, సంక్షేమానికి తూట్లు
- 28కి పైగా సంక్షేమ పథకాలు రద్దు
- దళిత సోదరులకు నక్కా ఆనంద్‌బాబు బహిరంగ లేఖ
చరిత్రలో దళితులకు ఏ ముఖ్యమంత్రీ చేయని నష్టాన్ని జగన్మోహన్రెడ్డి చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు. దళితవాడలను అన్ని విధాలా వివక్షకు గురిచేశారు. అయిదేళ్లలో దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఉన్న పథకాలను నిర్వీ ర్యం చేయడంతోపాటు 300 మందికి పైగా దళితులను హతమార్చి ప్రశ్నించిన వారిపై వేలాది కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్నారు. నిమ్నవర్గాల అభ్యు న్నతికి జీవితకాలం కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్.. సంవత్సరాలపాటు రాత్రింబవళ్లు శ్రమించి అనేక దేశాల సామాజిక, ఆర్థిక జీవన విధా నాలు అధ్యయనం చేసి భారత రాజ్యాంగాన్ని రూపొం దించి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచేలా చేశారు. అటువంటి రాజ్యాంగాన్ని జగన్ ప్రభుత్వం పక్కనపెట్టి దళితులకు దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయని నష్టాన్ని అయిదేళ్లలో జగన్‌రెడ్డి చేశారు.
చేసిన పాపాలను కప్పి పుచ్చుకు నేందుకు, దళితులకు జరిగిన అన్యాయాలకు మసిపూసి మారేడుకాయ చేసేందుకే విజయవాడలో అంబేద్కర్ విగ్రహం పేరుతో రాజకీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడుతున్నారంటూ దళిత సోదరులకు ఆనంద్‌బాబు బహిరంగ లేఖరాశారు. దళితులకు జగ న్‌రెడ్డి చేసిన ద్రోహాన్ని ఈలేఖ ద్వారా తెలియజేస్తున్నా నన్నారు.
లేఖలోని వివరాలు:
దళితులకు నేను మేనమామను.. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ మాటలు చెప్పి దళితులను జగన్‌రెడ్డి ఏ విధంగా వంచించారో ఈ అంశాలను పరిశీలిస్తే స్పష్టమవుతుంది.
1. బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా దశాబ్దాల కాలం నుంచి ఎస్సీల కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, స్వయం ఉపాధి, ఎస్సీ కార్పొరేషన్ కింద రుణాలు, అంబేద్కర్ విదేశీ విద్య వంటి 28కి పైగా పథకాలను రద్దు చేసి అభివృద్ధి కి, సంక్షేమానికి తూట్లు పొడిచారు.
2. 5 దళిత నియోజకవర్గాల మధ్య ఏర్పాటు చేసిన ప్రజా రాజధాని అమరావతిని నిర్వీర్యంచేసి దళితు ల అభివృద్ధిని విధ్వంసం చేశారు. రాజధాని పూర్త యి ఉంటే అత్యధికంగా లబ్ది పొందేది… ఉపాధి పొందేది దళితులే.
3. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందజేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధి కారంలోకి రాగానే, సర్వేల పేరుతో లబ్ధిదారుల సంఖ్య సగానికి కోత కోయడంతోపాటు దళిత వాడల్లో ఉంటేనే ఉచిత విద్యుత్ అమలవుతుందం టూ ప్రభుత్వం అవమానించింది.
4. దళితుల అభ్యున్నతికి గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూములు సైతం బలవంతంగా ప్రభుత్వం లాక్కొంటోంది. గత అయిదేళ్లలో 12 వేల ఎకరాల అసైన్డ్ భూములను లాక్కొని వేలాది దళిత కుటుం బాలను రోడ్డున పడేశారు. దళితులను బెదిరించి ఈ భూముల్లో అక్రమంగా మట్టి, గ్రావెల్ తవ్వకా లను యథేచ్ఛగా జరుపుతున్నారు.
5. 1989 నుండి అమలులో ఉన్న ఎస్సీ, ఎస్టీ అత్యా చార నిరోధక చట్టాన్ని కూడా నిర్వీర్యం చేశారు. ఈ చట్టం కింద ఎటువంటి జాప్యం చేయకుండా ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని చెబుతున్నా పట్టించు కోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభుత్వ ఉదాసీనత తో ఈ అయిదేళ్లలో దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో దళితులపై నేరాలు చోటు చేసుకున్నాయి.
6. దళితులకు అండగా ఉంటానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దమనకాండ చేసిన నేరస్తులకు మేనమామగా మారి వారికి అండగా నిలబడ్డారు.
` దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హతమార్చి, డోర్ డెలివరీచేసి తానే హత్య చేశానని ఒప్పుకున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును జగన్ పక్కన కూర్చోబెట్టు కుని సన్మానాలు చేయించడం దళితులను అవమానించడమే.
` మాస్క్ అడిగినందుకు విశాఖలో డాక్టర్ సుధా కర్ను, అక్రమాలను ప్రశ్నించినందుకు చిత్తూరులో డాక్టర్ అనితారాణిని, వేధింపులపై ప్రశ్నించినం దుకు చీరాలలో కిరణ్‌ను, మద్యం రేట్లపై మంత్రి పెద్దిరెడ్డిని ప్రశ్నించిన ఓంప్రతాప్‌ను, కావలి ఎమ్మె ల్యే ప్రతాప్‌రెడ్డి అక్రమాలను వెలుగులోకి తీసుకు వచ్చినందుకు కరుణాకర్‌ను, ఇలా వందలాదిమం ది దళితుల ప్రాణాలను బలిగొన్నారు.
7. ఎస్సీ, ఎస్టీలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు, విద్య, ఉపాధి ప్రమాణాలు పెంచేందుకు ఏర్పాటు చేసిన సబ్‌ప్లాన్‌ను నిర్వీర్యంచేశారు. టీడీపీ హయా ంలో అయిదేళ్లలో రూ.7.08లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చుచేస్తే అందులో రూ.37,173కోట్లు సబ్‌ప్లాన్ కోసం ఖర్చుచేస్తే… వైసీపీ ఈ అయిదేళ్లలో రూ. 9.40 లక్షల కోట్ల బడ్జెట్లో సబ్‌ప్లాన్ కోసం ఖర్చు చేసింది కేవలం రూ.30,028 కోట్లు మాత్రమే. జగన్ ప్రభుత్వం సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్ళిం చి పెద్దఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడిరది.
8. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళితవాడలు అభివృద్ధికి దూరంగానే ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఏ అభి వృద్ధి కార్యక్రమం మొదలుపెట్టినా దళితవాడల్లోనే మొదలుపెట్టాలని నిర్ణయం తీసుకుని 12వేల కి.మీ. మేర సిమెంటు రోడ్లను, 2 వేలకు పైగా వాటర్ ట్యాంకులను నిర్మించింది. జగన్ ప్రభుత్వ హయాంలో ఒక్క వాటర్ ట్యాంక్ కానీ, ఒక్క అడుగు రోడ్డు కానీ వేయలేదు. రోడ్లు, డ్రెయినేజి వ్యవస్థ వంటిమౌలిక ప్రాథమిక సౌకర్యాలు కూడా లేక దళిత వాడలు అస్తవ్యస్తంగా మారిపోయాయి.
9. దళిత యువకులు వ్యాపారవేత్తలుగా, పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు దోహదపడే ఎస్సీ కార్పొ రేషన్ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశారు. ఎస్సీలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటుచేసి ప్రభుత్వ సలహాదారులకు ఏడాదికి చెల్లించిన వేతనంలో సగం కూడా వీటికి ఖర్చు చేయలేదు.
10. మెరిట్ ప్రకారం, రిజర్వేషన్ల ప్రకారం భర్తీ చేయాల్సిన మెడికల్ కాలేజీ సీట్లను కూడా అమ్ము కుంటూ దళితులకు తీవ్ర అన్యాయం చేశారు. 17 మెడికల్ కాలేజీల ద్వారా దళిత బిడ్డలకు దక్కాల్సిన 544 మెడికల్ సీట్లను కూడా జగన్‌రెడ్డి అమ్ముకుని దళితులను డాక్టర్లు కాకుండా అడ్డుకున్నారు.
11. ఎయిడెడ్ వ్యవస్థను నిర్వీర్యం చేయడం, విదేశీ విద్యను ఆంక్షలతో అటకెక్కించడం, ఫీజు రీయిం బర్స్మెంట్ చెల్లింపులో జాప్యంచేసి విద్యను దళితు లకు దూరం చేశారు.
12. జగన్మోహన్రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం కోడి కత్తి దాడి పేరుతో శ్రీను అనే దళిత యువ కుడిని అయిదేళ్లుగా బెయిల్ కూడా రాకుండా వేధించడం ఆయన పెత్తందారీ పోకడలకు నిదర్శ నం. కోడి కత్తి శ్రీను కుటుంబ సభ్యులు విజయవా డలోని అంబేద్కర్ విగ్రహం వద్దే దీక్షకు దిగుతున్నా రంటే ప్రభుత్వ కక్షపూరిత చర్యలు ఏ విధంగా ఉన్నాయో స్పష్టమవుతోంది.
13. జిల్లాలకు సమదూరంలో ఉండి రాష్ట్రం నడిబొడ్డున ఉన్న ప్రజా రాజధాని అమరావతిలో 25 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన అంబేద్కర్ స్మృతివనాన్ని అర్థాం తరంగా నిలిపివేసి రాజకీయ ప్రయోజనాల కోసం హడావుడిగా విజయవాడలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జగన్‌రెడ్డి పెత్తందారీ పోకడలకు నిదర్శ నం. దళితుల్లో జగన్‌రెడ్డిపై పెరుగుతున్న వ్యతిరేక తను దారిమళ్ళించడానికే అంబేద్కర్‌విగ్రహం పేరు తో మరో వంచనకు జగన్‌రెడ్డి కుట్రపన్నారు. దళి తుల హక్కుల కోసం,చట్టాల కోసం, నిధుల కోసం కలిసికట్టుగా పోరాడి జగన్‌రెడ్డి బుద్ధి చెప్పాలి.