- 24నుంచి రాష్ట్రవ్యాప్తంగా దళిత సమరభేరి ర్యాలీలు
- రాజకీయ కక్షసాధింపు కోసం ఎస్సీ,ఎస్టీ చట్టం దుర్వినియోగం
- టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు
కర్నూలు : ఎస్సీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి నేడు దళిత వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ దారుణంగా మోసగిస్తున్నారని, రాష్ట్రంలోని దళితులంతా ఒక్కటై దళితద్రోహి జగన్‌రెడ్డిని ఇంటికి సాగనంపాలని టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు పిలుపు నిచ్చారు. తెలుగుదేశంపార్టీ జోన్-5(కర్నూలు,నంద్యా ల, కడప, అనంతపురం, హిందూపురం) ఎస్సీ సెల్ కార్యవర్గ సమావేశం కర్నూలు దేవిఫంక్షన్ హాలులో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎంఎస్ రాజు మాట్లాడుతూ.. గత టిడిపి ప్రభుత్వ హాయంలో దళితుల అభివృద్ధికోసం చంద్రబాబు అమలుచేసిన 29పథకాలను రద్దుచేటం, ఎస్సీ కార్పోరేషన్ నిధులను ఇతరఅవసరాలకు మళ్లిం చటం దారుణమని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అమలుకావటం లేదని,రాజారెడ్డి రాజ్యాం గాన్ని అమలు చేస్తున్నారన్నారు. అందువల్లే రాష్ట్రంలో దళిత జడ్జిలకు, వైద్యులు, మహిళలు, ఉద్యోగులు, చివరకు దళితుల భూములకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు. దళితుల రక్షణకోసం రూపొందిం చిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని జగన్మోహన్‌రెడ్డి రాజకీయ కక్షసాధింపు కోసం ఉపయోగిస్తూ ఎస్సీల పైనే ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ప్రయోగిస్తూ చట్టాన్ని దుర్వి నియోగం చేస్తోందని ఆరోపించారు. దళిత ద్రోహి జగన్‌మోహన్‌రెడ్డి నియంతృత్వ పాలనను సాగనంపేం దుకు టిడిపి ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో దళిత సమరభేరి ర్యాలీలను జోన్ల వారీగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 24న తిరుపతి, 28న కాకినాడ, వచ్చేనెల 5న విజ యవాడ,7న విశాఖపట్టణం,12న అనంతపురంలలో ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ ర్యాలీల్లో వేలా దిమంది దళితులు హాజరై సంఫీుభావం తెలపాలని, సంక్రాంత్రి తర్వాత జై భీం, జై టీడీపీ అనే నిరంతర కార్యక్రమాన్ని మొదలుపెట్టి దళిత వాడలలోని ప్రత ఇంటికి వెళ్లి జగన్‌రెడ్డి దళిత వ్యతిరేక విధానాలను ప్రచారంచేస్తామని చెప్పారు. దళితులను చైతన్యపరచి దళితద్రోహి జగన్‌రెడ్డిని గద్దె దించేవరకు పోరాటం కొనసాగిస్తామని, చంద్రబాబునాయుడు మరోమారు ముఖ్యమంత్రి అయితేనే దళితులకు న్యాయం జరుగు తుందని ఎంఎస్ రాజు పేర్కొన్నారు. కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షులు సోమిశెట్టి వేంకటేశ్వర్లు, కర్నూలు నియోజకవర్గ ఇన్‌చార్జి టిజి భరత్ నేతృత్వంలో నిర్వ హించిన ఈ సమావేశంలో కర్నూలు జిల్లా టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు దరూరు జేమ్స్, నంద్యాల జిల్లా టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షులు దామోదరం నాగశేషులు, కడప జిల్లా టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు జి.మల్లేష్, అనంతపురం జిల్లా టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు నాగరాజు, హిందూపురం పార్లమెంట్ టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు మంజునాథ్, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపా ధ్యక్షులు కోడూరి అఖిల్,టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్ధి భూమి రెడ్డి రాంభూపాల్‌రెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు కైలాష్, జయసూర్య, రాజశేఖర్, రెడ్డిపోగు బహారాన్న, జిల్లాటిడిపి నాయకులు వై.నర్సింహులు, బొగ్గుల ప్రవీ ణ్,ఉయ్యాలవాడ రమేశ్,దరూరు రాం ప్రకాష్, కె.శివ కుమార్, మందా అఖిల్ తదితరులు పాల్గొన్నారు.