- ఊచకోతతో 180మంది దళితుల హత్య
- దళితుల సంక్షేమ పథకాలు నిర్వీర్యం
- దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేస్తారా
- జగన్ హయాంలో దళితజాతికే అవమానం
- మే 13న జగనాసుర వధ తథ్యం
- పోటెత్తిన శింగనమలను చూసి చెప్తున్నా..
- పసుపు గెలుపు, ప్రభుత్వ ఏర్పాటు ఖాయం
- ఐదేళ్ల విధ్వంసాన్ని గుర్తెరిగి ఓటేయండి
- బటన్ నొక్కినదెంత? జగన్ బొక్కినదెంత?
- దగా, దోపిడీలపై ప్రతి గడపా చర్చించాలి
- ‘ప్రజాగళం’ సభలో చంద్రబాబు పిలుపు
శింగనమల (చైతన్య రథం): ఐదేళ్ల జగన్ పాలనలో దళితజాతి నిర్వీర్యమైపోయిందని, దళితులను ఊచకోత కోసిన జగన్‌ను క్షమించకూడదని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. జగన్‌ను దళిత ద్రోహిగా అభివర్ణించారు. ‘ప్రజాగళానికి పోటెత్తిన శింగనమల జనాన్ని చూసి చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో ప్రసంగించారు. దళితులకు ద్రోహం చేసిన జగన్‌పై తీవ్రస్వరంతో విరుచుకుపడ్డారు. దళితు లకు న్యాయం చేసే సంకల్పంతో వర్గీకరణను తీసు కొస్తే, దాన్ని రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం నాశనం చేసింద న్నారు. వర్గీకరణకు కేంద్రంలోని ఎన్డీయే ముందుకు రావడం సంతోషకరమన్నారు. సామాజిక న్యాయానికి కట్టుబడివున్న పార్టీ తెలుగుదేశం అంటూనే.. దళితుల కు న్యాయం చేస్తానని జగన్‌రెడ్డి ఊచకోత కోసిన విషయాన్ని గుర్తెరగాలని పిలుపునిచ్చారు. దళితులకు తెదేపా అమలు చేసిన 27 సంక్షేమ పథకాలు రద్దు చేయడమే కాదు, సబ్ ప్లాన్ నిధులనూ దారి మళ్లించా డన్నారు. కార్పొరేషన్లను నిర్వీర్యం చేసి, బెస్ట్ అవైలబుల్ పథకాలను నిర్వీర్యం చేశాడని జగన్‌పై విరుచుకు పడ్డారు. వైసీపీ హయాంలో దళితులకు స్వాతంత్య్రం కరవైందని, దాడులు దౌర్జన్యాలకు బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై ఆరువేలకు పైగా తప్పుడు కేసులు బనాయిస్తే, 180మంది దళితులు హత్యకు గురయ్యారని గుర్తు చేశారు. కాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీ.. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేశాడంటే వైసీపీ మూకలు ఎంతకు తెగించాయి, ఆ మూకలను నాయకుడు ఎంత ప్రోత్సహిస్తున్నాడో అర్థం చేసుకోవాలన్నారు. దళిలతులకు న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం అన్నారు.
‘జగన్ అహంకారాన్ని ప్రజాపాదంతో తొక్కే రోజు మే 13. పోటెత్తిన శింగనమలను చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతుంది.. అదేరోజు జగనాసుర వధ తథ్యమని’ అని తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రస్వరంతో ఉద్ఘాటించారు. ‘జగన్‌రెడ్డీ, సిద్ధంగావుండు. నీ అహంకారం కుప్పకూలుతుంది. పెత్తనం బద్ధలవుతుంది. అక్రమాలకు ముగింపుపడుతుంది. తాడేపల్లి ప్యాలెస్ బద్దలు కొడతాం. సిద్ధం అంటూ రోడ్డెక్కిన నిన్ను ఓడిరచడానికి ప్రజలంతా సిద్ధం. కాస్కో’ అంటూ చంద్రబాబు ఉద్వేగంతో హెచ్చరించారు. ‘రావణుడు కూడా నాకంటే గొప్పోడు లేడన్నారు. కానీ, చివరికి రాముడి చేతుల్లో ఏమయ్యాడో తెలుసుకో’ అంటూ హితోక్తి పలికారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. అందరం వైసీపీ బాధితులమే. మనం మనం చేతులు కలపాలి. జగన్‌రెడ్డి అరాచకంపై ఉద్యమించాల్సిందే అని బాబు పిలుపునిచ్చారు. మేధావులు, సామాజిక వేత్తలు, రాష్ట్రంలోని ఆడబిడ్డలు ఆలోచించంచాలని, భవిష్యత్ కోసం బాధ్యతగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఓటింగ్ రోజున గ్రామాలన్నీ ఏకం కావాలని, ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు సమాయత్వం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అందుకు ప్రతి ఒక్కరూ ఇంటింటికెళ్లి సైకిల్ గుర్తుకు ఓటేసేలా ఒప్పించాలని, భవిష్యత్‌కు మనమే గ్యారెంటీ కల్పించుకోవాలన్నారు. రాష్ట్రంలో నష్టపోయిన ప్రతిరంగం వృద్ధిలోకి రావాలంటే `తిరిగి తెలుగుదేశం అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని గుర్తించమని బాబు విజ్ఞప్తి చేశారు.
బీసీలను ప్రస్తావిస్తూ.. పార్టీకి వెన్నెముకగా అభివర్ణించారు. బీసీల అభ్యున్నతికి రూపొందించి అమలు చేసిన 30 పథకాలను జగన్ గద్దెనెక్కగానే రద్దు చేశాడని చంద్రబాబు గుర్తు చేశారు. బీసీలకు తీవ్ర అన్యాయం చేసిన బీసీ ద్రొహి జగన్ అన్నారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే అమలు చేయడానికి బీసీ డిక్లరేషన్ సిద్ధం చేశామని, బీసీలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
బాబాయి హత్యోదంతంపై జగన్ నాటకాలు
నిన్న పులివెందులలో సభ నిర్వహించిన జగన్‌రెడ్డి `బాబాయి గొడ్డలివేటుపై మళ్లీ నాటకాలు మొదలెట్టాడని దుయ్యబట్టారు. వివేకా హత్యోదంతాన్ని వివరిస్తూ `‘2019 మార్చి 15న సాక్షి టీవీలో గుండెపోటు అన్నారు. తర్వాత రక్తపు వాంతులు అన్నారు. ఆ తర్వాత గొడ్డలిపోటు అన్నారు. చివరగా నా చేతిలో గొడ్డలి పెట్టి దొంగ సాక్షిలో బొమ్మ వేశారు. తర్వాత బెంగళూరులో ఆస్తికి సంబంధించి సెటిల్మెంట్లే హత్యకు కారణం అన్నారు. అప్పట్లో ఏపీ పోలీసులపై నమ్మకం లేదు, సీబీఐ విచారణ కావాలన్నాడు. హైకోర్టుకు వెళ్లి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. అధికారంలోకి రాగానే.. సీబీఐ విచారణ వద్దు అంటూ వేసిన పిటిషన్ విత్ డ్రా చేసుకున్నాడు. కానీ సునీత పోరాటం ఆపలేదు. తండ్రి హంతకుల్ని పట్టుకోవాల్సిందేనని పోరాడుతోంది. వివేకా హత్యకు రెండో వివాహమే కారణమన్నారు. ఆస్తిలో అల్లుడితో విరోధమే కారణమన్నారు. తర్వాత కూతురే హత్య చేసిందన్నారు. తర్వాత సునీల్‌యాదవ్ తల్లిని లైంగికంగా వేధించినందునే చంపేశారన్నారు. ఇన్ని కట్టుకథలు అల్లుకుంటూ వచ్చిన జగన్ టీం `నిన్న పులివెందుల వచ్చిన జగన్ రెడ్డి.. బాబాయిని ఎవరో చంపేసి దాన్ని వారిమీదకు నెట్టేస్తున్నారని బీరాలు పోతున్నాడు. ఇద్దరు చెల్లెల్లని నేను మేనేజ్ చేస్తున్నానంటూ కథలు చెబుతున్నాడు. అన్ని రాజకీయ పార్టీలను నేనే మేనేజ్ చేస్తున్నానని, ఆయన ఒంటరి వాడని మాట్లాడుతున్నాడు. ఇన్ని కట్టుకథలు అల్లే వ్యక్తిని నమ్మగలమా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘ఊళ్లోకి పిచ్చికుక్క వస్తే తరిమేస్తాం. జగన్ వ్యవహారం చూస్తుంటే అలాగేవుంది. అందుకే `రాష్ట్రానికి పట్టిన శనిగ్రహాన్ని వదిలించుకోవడానికి అంతా ఏకం కావాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
జగన్ చూస్తే ఇవీ గుర్తుకొచ్చేది..
జగన్‌ని చూస్తే విధ్వంసం గుర్తుకొస్తుందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. దారుణమైన రోడ్లు చూస్తే జగన్ గుర్తొస్తాడు. కొట్టుకుపోయిన సాగునీటి ప్రాజెక్టులు చూస్తే గుర్తొస్తాడు. పాడుబడిన రాజధాని చూస్తే గుర్తొస్తాడు. పూర్తికాని పోలవరం చూస్తే జగన్ గుర్తొస్తాడు. గంజాయి, డ్రగ్స్, మాఫియాలను చూస్తే జగన్ గుర్తొస్తాడు. ప్రజల జీవితాలను నాశనం చేసిన వాడంటే జగన్ గుర్తొస్తాడు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి నంగనాచిలా మాట్లాడుతున్నాడు. రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టని ద్రోహి జగన్ అన్నారు. తెదేపా హయాంలో సీమ ప్రాజెక్టుల కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తే, హంద్రీనీవా కోసమే ఏకంగా రూ.5800 కోట్లు ఖర్చు చేశామన్నారు.
శింగనమలలో దెంతులూరు వద్ద సెంట్రల్ యూనివర్శిటీ పనులు నిలిచిపోయాయి. కేంద్రంతో మాట్లాడి పనులు పూర్తి చేయిస్తానన్నారు. గార్లదిన్నె మండలంలో అన్న క్యాంటీన్ పెట్టి ప్రతి ఒక్కరి ఆకలితీర్చే బాధ్యత తీసుకుంటా. రాష్ట్రమంతా విరివిగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తా. ఉల్లికల్లు ఆర్ అండ్ ఆర్ చాగళ్లు రిజర్వాయర్లకు రూ.168 కోట్లు కేటాయించి పనులు చేస్తానని చెప్పిన జగన్ దాన్ని విస్మరించాడు. దాన్ని నేను వచ్చాక పూర్తి చేస్తా. శింగనమలలో 10 నెలల క్రితం అంబేద్కర్ విగ్రహం కడతానన్నడాడు కట్టాడా? మిడ్ పెన్నార్ నిర్వహణకు రూ.3 కోట్లు ఇస్తానన్నాడు. ఇచ్చాడా. గండికోట, సుబ్రయాన్‌సాగర్, పొట్లూరు మండలానికి నీటి పైపులైన్ల కోసం రూ.250 ఇస్తానన్నాడు. ఇచ్చాడా? జగన్ మాటలు కోటలు దాటతాయి. చేతలు గడప కూడా దాటవు. కోల్డ్ స్టోరేజీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తానని దగా చేశాడు. గార్లదిన్నె, శింగనమలలో షాధీఖానా 95 శాతం పనులు పూర్తైపోయినా.. ఐదేళ్లలో 5శాతం పనులు పూర్తి చేయలేదు. చిన్ని పనులు కూడా చేయలేనివాడు మూడు రాజధానులు కడతానంటున్నాడు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అని చంద్రబాబు విరుచుకుపడ్డారు.
ఎమ్మెల్యే పెద్ద మేతగాడు..
స్థానిక ఎమ్మెల్యే దోపిడీకి కేరాఫ్ అడ్రస్‌లా మారాడని, ప్రభుత్వ భూములు, వివాదాలున్న భూములు మొత్తంగా 500 ఎకరాలు, కోడుమర్తి గ్రామంలో 2.50 ఎకరాల శ్మశానం భూమిని కబ్జా చేశాడని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విండ్, సోలార్ మిల్లుల యజమానుల్ని బెదిరించి డబ్బులు దండుకుంటున్నాడన్నారు. బండారు శ్రావణిశ్రీ చదువుకున్న అమ్మాయి. సీనియర్ నాయకులు కేశవరెడ్డి, సీనియర్ నాయకులు నరసయ్య, రామలింగారెడ్డిలాంటి ఎంతోమంది ఉన్నారు. ప్రజాసేవకు నిమగ్నమైన బండారును గెలిపించి తెదేపా బలం పెంచుకోవాలన్నారు. జగన్‌ను తరిమికొట్టి, తెదేపాను గెలిపించటంలో శింగనమల కొత్త చరిత్ర రాయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఒంటిమిట్టలో చేనేత కార్మికుడి భూమి రికార్డుల్ని వైసీపీ నేతలు ఆన్‌లైన్లో మార్చేశారు. చివరికి దిక్కుతోచని స్థితిలో కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. మళ్లీ జగన్‌రెడ్డి అధికారంలోకి వస్తే.. మన ఇళ్లు మనవికావు. మన పొలాలు మనకుండవు. రాష్ట్రమే సర్వనాశనం అవుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మన ప్రభుత్వం వస్తే అందరూ బాగుంటారు. 46 రోజులపాటు పని చేయండి. తెలుగుదేశం పార్టీని గెలిపించండి అంటూ చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.