• కోవూరు నియోజకవర్గం దామరమడుగుకు చెందిన రైతులు నారా లోకేష్ ను కలిసి సమస్యలు చెప్పుకున్నారు.
• రైతు భరోసా కేంద్రాలను ఈ ప్రభుత్వం దందా కేంద్రాలుగా మార్చింది.
• మోటార్లకు మీటర్లు పెట్టి ఈ ప్రభుత్వం రైతులపై భారం మోపాలని చూస్తోంది.
• పంటలకు గిట్టుబాటు ధర ఉండటం లేదు.
• కోవూరు కాలువ తవ్వించకపోవడం వల్ల వర్షం వచ్చినప్పుడు నీళ్లు పోక గ్రామంలోకి వస్తున్నాయి. దీనిని అధికారంలోకి రాగానే పూర్తి చేయాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• ముఖ్యమంత్రి జగన్ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి రైతాంగం మెడకు ఉరితాడు బిగించాలని చూస్తున్నాడు.
• రైతు భరోసా కేంద్రాల వల్ల రైతాంగానికి ఎటువంటి ఉపయోగం లేదు.
• పాదయాత్ర సమయంలో రైతుల గిట్టుబాటు ధరకు రూ.3,500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తానన్న సిఎం… అధికారంలోకి వచ్చాక పత్తా లేకుండా పోయారు.
• టీడీపీ అధికారంలోకి వచ్చాక కోవూరు పంట కాల్వను పూర్తి చేస్తాం.
• గత ప్రభుత్వంలో రైతులకు అందించిన సబ్సిడీ ఎరువులు, విత్తనాలు, డ్రిప్ వంటి వన్నీ అధికారంలోకి రాగానే పునరుద్దరిస్తాం.