- విజయసాయిరెడ్డి అనుచరుడి అకృత్యాలు
- ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ నిర్వాకం
- ప్రజా వినతుల్లో పందిగుట్టూరు వాసుల ఫిర్యాదు
- అర్జీలు స్వీకరించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి
మంగళగిరి(చైతన్యరథం): చిత్తూరు జిల్లా ఐరాల మండలం పందిగుట్టూరు గ్రామం లో విజయసాయిరెడ్డికి అనుచరుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నిరంజన్‌రెడ్డి ట్రస్ట్ పేరుతో చేస్తున్న దందాలపై గ్రామానికి చెందిన పలువురు శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. గ్రామంలోని పాదగిరి స్వయంభు పాతాళ వినాయక స్వామి దేవాలయం పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తుం డటమే కాకుండా ఆలయాన్ని నిర్మించిన వారిని రాకుండా అడ్డుకుంటున్నారని వివరిం చారు. ఆలయ నిర్మాణ దాతల పేరుతో ఉన్న శిలాఫలకాలను ధ్వంసం చేసి ఆలయం చుట్టూ ఉన్న భూములను కబ్జా చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. ఆయన దందాపై విచార ణ జరిపి చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణలకు అర్జీలు స్వీకరించారు.
` 30 సంవత్సరాల నుంచి తమ స్వాధీనంలో ఉన్న భూమిని కొట్టేసేందుకు వైసీపీ నేతలు యత్నిస్తున్నారని నెల్లూరు జిల్లా కలిగిరి మండలం బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఫిర్యాదు చేశాడు. పంట వేసుకుంటే అర్ధరాత్రుల్లో వచ్చి ధ్వంసం చేస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకుంటే వైసీపీ నేతల వద్ద లంచం తీసుకుని పట్టించుకోవడంలేదని వాపోయారు.
` తమ తాతల నుంచి సాగులో ఉండి 2021 వరకు తమ పేరుపై ఆన్‌లైన్‌లో ఉన్న భూమిని వైసీపీ నేత అక్రమంగా 2022లో ఆయన పేరుపై మార్చుకున్నాడని కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన మేదర మేరి ఫిర్యాదు చేసింది. అక్రమంగా ఆన్‌లైన్ చేసుకున్న లక్ష్మీనారాయణ గుప్తా పేరును తొలగించి తమకు న్యాయం చేయాలని కోరారు.
` తమ సొంత ఆస్తుల కబ్జాకు వైసీపీ నేతలు కర్రి వేణుబాబు, బేతిరెడ్డి లీలా కృష్ణారెడ్డి ప్రయత్నిస్తున్నారని, వారి కబ్జాకు అధికారులు సహకరిస్తున్నారని పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం వెలగలేరు గ్రామానికి చెందిన కొవ్వూరి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశాడు. కబాదారులు, వారికి సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకు ని తమకు న్యాయం చేయాలని అర్జీ ఇచ్చాడు.
` జాతీయ రహదారి ఎన్‌హెచ్ 16 విస్తరణలో భాగంగా తమ భూమిని తీసుకుని నెలలు గడుస్తున్నా తమకు ఎటువంటి పరిహారం ఇవ్వలేదని పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి గ్రామానికి చెందిన పలువురు రైతులు ఫిర్యాదు చేశారు. దయచేసి తమకు రావాల్సిన పరిహారం వెంటనే వచ్చేలా చూడాలని కోరారు.