కృష్ణమ్మ ఉగ్రరూపాన్ని చూసి కంగారుపడలేదు. పోటెత్తిన వరదను చూసి చలించలేదు. ప్రజలు పీకల్లోతు కష్టాల్లోవుంటే తాను గట్టున ఉండలేకపోయాడు. ముంచెత్తిన వరదకు ఎదురెళ్లాడు. నాయకుడిగా ప్రజల సంరక్షణే తన బాధ్యతంటూ.. కటిక చీకట్లలో సైతం కాళ్లరిగేలా తిరిగాడు. బోరున వాన కురుస్తున్నా.. కాళ్లకింద వరద విసిరికొడుతున్నా.. తను కనిపిస్తే ప్రజలు ధైర్యంగా ఉంటారన్న తెగింపు చూపించాడు. ఒక్కరు కూడా వరదపాలవ్వడానికి వీల్లేదన్న శాసనం తనకు తనే రాసుకున్నాడు. కాళ్ల కిందున్నది వరదా.. బురదా అన్నది చూడలేదు. వరదలో చిక్కుకున్న ప్రజలను గట్టుకు చేర్చాలన్న తపన తప్ప మరేం చూసుకోలేదు. బాధితులు కడుపు నిండిరదో లేదోనన్న ఆలోచనే తప్ప.. తన కడుపు ఎండిపోతుందని ఆలోచించలేదు. భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్న వరద బాధితుల గుండె జారిపోకుండా.. కంటిమీద కనుకు మర్చిపోయి రేయింభవళ్లు వాళ్లమధ్యే గడిపాడు. తాను ముఖ్యమంత్రినన్న విషయం చూసుకోలేదు. తన కాన్వాయ్ ఎక్కడుందో పట్టించుకోలేదు. బాధితులంతా బయటకు వచ్చేవరకూ తానూ ఓ వరద బాధితుడేనన్నట్టు.. విస్తృత పర్యటనలు సాగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గెలిచాడు. మొన్నటి ఎన్నికలలో సాధించిన విజయంకంటే.. వేలాది ప్రాణాలకు ఉపశమనాన్నిచ్చిన ఇదీ అసలు గెలుపు.
ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలకు రక్షణ కవచం నిర్మించడం.. సీఎం చంద్రబాబుకు కొత్త కాదు. ఆయన రాజకీయ జీవితంలో ప్రభుత్వాధినేతగాను, ప్రతిపక్ష నేతగానూ.. ఎన్నో ఉపద్రవాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించిన ఉక్కుమనిషి `చంద్రబాబు. గత 72 గంటల సమయంలో `పెను ఉత్పాతం నుంచి ప్రజా రాజధాని ప్రాంతాన్ని కాపాడుకుని.. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని మరోసారి నిరూపించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇలాంటి సందర్భాల్లోనే `దటీజ్ చంద్రబాబు అనకుండా ఉండలేం.
72 గంటల క్రితం. భారీ వర్షాల నేపథ్యంలో ఉప్పొంగిన కృష్ణమ్మ ఉగ్ర రూపానికి విజయవాడ విలవిల్లాడిపోయింది. వరదల్లో చిక్కుకుని విజయవాడ సహా పరిసర ప్రాంతాల ప్రజలు పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. కూడు, గూడు, గుడ్డ.. సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఆ క్షణంలోనే `క్రైసిస్ మేనేజ్‌మెంట్‌ను ఔపోసన పట్టిన సీఎం చంద్రబాబు క్షణం ఆలోచించలేదు. కంటిముందు ముఖ్యమంత్రి కనిపించడమే.. కష్టాల్లోవున్న ప్రజలకు కొండంత ధైర్యమని భావించారు. వరద పరిస్థితికి ఏమాత్రం వెరవకుండా.. బధిత ప్రజల వద్దకు వెళ్లిపోయారు. ‘నేనున్నా. అధైర్య పడొద్దని’ ధైర్యం చెబుతూనే.. తన అనుభవాన్ని రంగరించి ‘మిషన్ సీబీఎన్’ను ఆపరేట్ చేసి విజయం సాధించారు.
కంటిమీద కునుకులేకుండా.. భోజనం కూడా చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న విధానాన్ని తక్కువ చేసి చెప్పలేం. తానే స్వయంగా ముంపు ప్రాంతాల్లో కలియతిరుగుతూ వరద బాధితులకు భరోసా ఇస్తున్నారు. గత మూడు రోజుల నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వరద నీటిలోనే నడుచుకుంటూ బాధితుల వద్దకు వెళ్తున్నారు. వారిని పరామర్శించి అండగా ఉంటామని.. అధైర్యం పడొద్దని భరోసా ఇస్తున్నారు. సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తూ.. మంత్రులు, ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించి `ఆపరేషన్ ఫ్లడ్ మిషన్‌ను చంద్రబాబు నడిపించిన విధానానికి హ్యాట్సాప్ చెప్పకుండా ఉండలేం.
7.49కోట్ల మందికి ఫ్లడ్ అలెర్ట్ మెసేజ్‌లు
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడి
భారీ వర్షాలు, వరదలు సమయంలో ఏపీ అలెర్ట్ ద్వారా 7.49 కోట్లమందికి ఫ్లడ్ అలెర్ట్ మెసేజ్‌లు పంపినట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడిరచింది. మంగళవారం రాత్రి వరద పరిస్థితి సమాచారాన్ని మీడియాకు విడుదల చేసింది. ఈమేరకు వరదల్లో చిక్కుకుని క్షిష్టపరిస్థితుల్లోవున్న 21మందిని హెలికాప్టర్స్ ద్వారా రక్షించినట్టు వెల్లడిరచింది. భారీ వరద కారణంగా ఇప్పటి వరకూ 149 పశువులు, 59,848 కోళ్లు మరణించాయని, 11968 వేల పశువులకు వ్యాక్సిన్ అందించామని పేర్కొంది. 12 విద్యుత్ సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయని, అధిక వర్షాల కారణంగా 2851 కిమీ పొడవున ఆర్ అండ్ బి రోడ్లు దెబ్బతిన్నట్టు వెల్లడిరచింది. అలాగే, 180243 హెక్టార్లలో వరి, 17645 హెక్టార్లలో ఉద్యాన పంటలు నీట మునిగాయని పేర్కొంది. 221 కిమీ మేర పంచాయతీ రహదారులు దెబ్బతిన్నాయని, 78 మైనర్ ఇరిగేషన్ చెరువులకు గండ్లు పడ్డాయని వెల్లడిరచింది. మంగళవారంనాటి పరిణామాల్లో 6 హెలికాప్టర్ల ద్వారా 4870 కేజీల ఆహరాన్ని వరద బాధితులకు అందించినట్టు వెల్లడిరచింది.