అమరావతి: చంద్రబాబుపై, టీడీపీపై నోరు పారే సుకుంటున్న కొడాలి నానీకి రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహాక కార్యదర్శి, రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ రాష్ట్రంలో కరవు, కాటకాలు కరాళ నృత్యం చేస్తున్నాయన్నారు. జగన్మోహన్రెడ్డి, కొడాలి నానీల పాద ప్రభావంతో రాష్ట్రం.. కృష్ణాడెల్టా ప్రాంతం దుర్భి క్షాన్ని అనుభవిస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రికి, మాజీ మంత్రికి రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన కృష్ణా జలాల కోసం కేంద్రానికి లేఖలు రాసే ధైర్యం లేద న్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయం లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడమే రాష్ట్ర రైతాంగానికి శాపంగా మారిందన్నారు. రైతులకు అవసరమైన సాగునీరు.. విత్తనాలు.. ఎరువులు.. సూక్ష్మపోషకాలు అందించడంలో జగన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యాడు. మరోపక్క సుభిక్షమైన కృష్ణాడెల్టా ప్రాంతం ఎడారిగా మారినా మాజీమంత్రి కొడాలి నాని ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రిని ప్రశ్నించింది లేదు. పట్టిసీమను వట్టిసీమ అని నిందలేసిన జగన్ రెడ్డి.. వైసీపీ నేతలు.. మంత్రులు ఇప్పుడు దాన్నే వినియోగించుకోవాల్సిన దుస్థితికి వచ్చారని గోనుగుంట్ల విమర్శించారు.
మతిచలించి మాట్లాడుతున్న కొడాలి నానీకి రోజులు దగ్గరపడ్డాయి :
చంద్రబాబుపై, టీడీపీపై నోరు పారేసుకుంటున్న కొడాలి నాని తన స్థాయి ఏమిటో గుర్తుంచుకొని మాట్లాడాలి. గతంలో నాలాంటి టీడీపీ నేతలకు టీ, కాఫీలు అందించిన కొడాలి నాని.. నేడు జగన్ ప్రభుత్వంలో అహంకారంతో నోరు పారేసుకుంటున్నాడు. గుడివాడలోని తోపుడుబండ్ల వ్యాపారుల నుంచి మామూళ్లు వసూలు చేయడం.. పేదల బియ్యాన్ని విదేశాలకు సరఫరా చేయడం.. పేకాట క్లబ్బులు .. జూద కేంద్రాలు నిర్వహించిన నీతి మాలిన చరిత్ర నానీది. తాగిన మైకంలో మైకుల ముందు మతి చలించినవాడిలా మాట్లాడుతున్న కొడాలి నానీకి రోజులు దగ్గరపడ్డాయి. గతంలో హైదరాబాద్ ఆహ్వానం హోటల్లో నేలపై పడుకొని.. టీడీపీ నేతల చుట్టూ తిరుగుతూ.. చంద్రబాబు ప్రాపకం కోసం పాకులాడిన చరిత్ర నానీది. గతంలో చేసిన పాపాలు.. నందమూరి, నారా కుటుంబాలను నానా మాటలు అన్నందుకే నానీకి గొంతు క్యాన్సర్ వచ్చింది. తన నోటి దూలతో చివరకు తన ఇద్దరు కూతుళ్ల జీవితాలను కూడా నానీ నాశనం చేసే స్థితికి వచ్చాడని గోనుగుంట్ల విమర్శించారు.
అన్యాయంగా చంద్రబాబుని జైలుకు పంపిన జగన్ రెడ్డి.. 50 రోజులైనా టీడీపీ అధినేత రూపాయి అవినీతి చేశాడని నిరూపించలేకపోయాడు. చంద్రబాబు ప్రజల్లో కి వెళ్లి.. తన అవినీతి అక్రమాలను ఎండగడుతున్నా డన్న అక్కసుతోనే జగన్ రాజకీయ కుట్రలకు పాల్పడి అన్యాయంగా చంద్రబాబుని జైలుపాలు చేశాడని ప్రజలు గ్రహించారు. చంద్రబాబు సమర్థవంతంగా అమలుచేసిన స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ను జగన్ తన స్వార్థ రాజకీయాలకు బలిచేసి, యువత జీవితాల్లో నిప్పులు పోశాడు. చంద్రబాబు తప్పు చేయరు, టీడీపీ నేతలు ఎవరు ఎలాంటి తప్పుచేసినా చంద్రబాబు సహించరు. అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి తప్పు చేశాడని జగన్‌రెడ్డి.. కొడాలినాని లాంటివాళ్లు ఎంతగా విషప్రచారం చేసినా ప్రజలు నమ్మరు. గతంలో పౌర సరఫరాలశాఖా మంత్రిగా ఉన్న కొడాలి నానీ వేల లారీల ఇసుకను స్వయంగా దగ్గరుండి పక్క రాష్ట్రాలకు తరలించి, జగన్‌రెడ్డికి అవినీతి సొమ్మును చేరవేశాడు. నీతి…జాతి లేని నాని మరోసారి చంద్రబాబుని గానీ, లోకేశ్‌ను గానీ, ఆయన కుటుంబ సభ్యులను గానీ ఏమైనా అంటే అతని చర్మం ఒలిచి దివ్యాంగులకు చెప్పులు కుట్టిస్తాం. భువనేశ్వరికి ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే నానీ లాంటి పనికిమాలిన వాళ్లు… మతిలేని మంత్రులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడు తున్నారు. లోకేశ్ పప్పో… నిప్పో తెలియాలంటే జగన్ రెడ్డి, మా యువనేతతో కలిసి మీడియా ముందుకు రావాలి. లోకేశ్ వాగ్ధాటికి జడిసి.. ఆయన లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే జగన్‌రెడ్డి తన మంత్రులతో విషప్రచారం చేయిస్తున్నాడు. జగన్ రెడ్డికి కోర్టులంటే భయం ఉంది కాబట్టే.. తప్పు చేశాడు కాబ ట్టే.. తనపై ఉన్న కేసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నాడని నాని తెలుసుకోవాలి.
నాలుగున్న రేళ్ల పాలనలో జగన్‌రెడ్డి అన్నివర్గాలను దారు ణంగా వంచించాడు. దళితులు.. బీసీలు.. మైనారిటీ లు.. మహిళలు.. రైతులు అందరూ జగన్ బాధితులే. బటన్ నొక్కుడు పేరుతో వారిని వంచించిన జగన్ కు వచ్చే ఎన్నికల్లో బుద్ధిచెప్పడానికి వారంతా ఎదురుచూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వమంటే ఏంటో తెలియదు.. పరిపాలన అసలే తెలియదు. మంత్రులకు వారి శాఖల గురించి తెలియదు. జగన్ అండ్ కో కి తెలిసిందల్లా దోపిడీనే. ప్రజలంతా ఇప్పటికైనా జగన్ రెడ్డి అతని ప్రభుత్వ దుశ్చర్యలు.. దుర్మార్గాలు.. అవినీతి..దోపిడీపై ఆలోచించి, వచ్చేఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు తగిన విధంగా బుద్ధిచెప్పాలి. ఓటు అనే ఆయుధంతో 175 నియోజకవర్గాల్లోని వైసీపీ అభ్యర్థులను ఓడిరచి, చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉంది. చంద్రబాబు ఎక్కడున్నా..ఏం చేస్తున్నా ఆయన ఆలోచనలు ప్రజల చుట్టూనే తిరుగుతాయని తెలుసుకో నానీ. జగన్ రెడ్డి దెబ్బకు అతని తల్లి..చెల్లే రాష్ట్రం వదిలి పారిపోయారని వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తెలుసుకోవాలి. గతంలో జగన్ తో అంటకాగి.. అతన్ని పొగిడినవారంతా అతని నిజస్వరూపం తెలుసుకున్నాక ఛీ కొడు తున్నారు. దివ్యాంగులు తమకు చేసిన అన్యాయానికి జగన్ కు ఎప్పుడు బుద్ధి చెబుదామా అని ఎదురుచూస్తున్నారు. కొడాలి నాని ఇప్పటికైనా మనిషిలా ప్రవర్తించకపోతే వచ్చే ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గ ప్రజలు అతనికి సమాధి కడతారని గోనుగుంట్ల హెచ్చరించారు.