- ఇళ్లవద్దే ఇచ్చే అవకాశం ఉన్నా కాదని వృద్ధులకు ద్రోహం
- జగన్ కుట్రకు బాధితులుగా అవ్వాతాతలు
- మద్యం షాపుల వద్ద టీచర్లు, వీఆర్వోలను పెట్టినపుడు.. పెన్షన్లు వారితో ఇవ్వలేరా?
- కావాలనే పెన్షన్లు జాప్యం చేసి టీడీపీపై నిందలు
- ఖజానా మొత్తాన్ని సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టడమే పెన్షన్ల జాప్యానికి కారణం
- ఇళ్ల వద్ద ఇచ్చేందుకు సిద్ధమని కలెక్టర్లు చెప్పినా జవహర్‌రెడ్డి, మురళీధర్ రెడ్డి మోకాలడ్డారు
- జగన్‌రెడ్డి చేసే గోబెల్స్ ప్రచారాన్ని ప్రజలు నమ్మబోరు
- ధ్వజమెత్తిన టీడీపీ నేతలు దువ్వారపు రామారావు, వేమూరి ఆనందసూర్య
అమరావతి (చైతన్యరథం): జే బ్రాండ్ మద్యం అమ్మకాల కోసం మద్యం షాపుల వద్ద టీచర్లు, వీఆర్వో లను నిలబెట్టిన జగన్‌రెడ్డి.. వారి ద్వారా పెన్షన్ పంపి ణీకి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో సమా ధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యులు దువ్వారపు రామారావు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనందసూర్య డిమాండ్‌చేశారు. పెన్షన్ల పంపిణీ విషయంలో జగన్‌రెడ్డి చేస్తున్న దుష్ప్ర చారాల ను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
జగన్‌రెడ్డి కుట్రలో భాగమే
ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మాట్లాడుతూ.. గత ఎన్నికల ముందు కోడికత్తి దాడి, వివేకా హత్య కేసు, పింక్ డైమండ్ లాంటి ఎన్నో విషయాల్లో జగన్ రెడ్డి నీతిమాలిన రాజకీయాలు చేశారని ధ్వజమెత్తారు. ఇప్పుడు పెన్షన్ల విషయంలో అధికారుల్ని అడ్డం పెట్టు కుని కుట్రలు చేస్తున్నారు. ఒకటో తేదీన ఇవ్వాల్సిన పెన్షన్ల సొమ్మును అస్మదీయులకు దారబోశారు. మార్చి 16-30 తేదీల మధ్య రూ.13వేల కోట్లు సొంత కాంట్రాక్టర్లకు చెల్లించి ఖజానా ఖాళీ చేశారు. పెన్షన్లకు డబ్బులు లేకుండా చేసి ఆ నెపాన్ని తెలుగుదేశం పార్టీ పైకి నెడుతున్నారు. రెండు రోజుల క్రితం కలెక్టర్లతో సీఎస్ నిర్వహించిన సమీక్షలో.. అందరు కలెక్టర్లూ ఇళ్ల వద్ద పెన్షన్ల పంపిణీకి సిద్ధమని చెప్పారు. అయినా సెర్ప్ సీఈవో మురళీధర్‌రెడ్డి,సీఎస్ జవహర్‌రెడ్డి ఉద్దేశ్య పూర్వకంగా ఇళ్లవద్ద ఇవ్వలేమని ఆదేశాలివ్వడం జగన్ రెడ్డి కుట్రలో భాగమే. ప్రభుత్వ ఖజానా మొత్తాన్ని ఊడ్చేసి,ఎన్నికలకు ముందు గోబెల్స్ ప్రచారానికి తెరలే పారు. ఎన్నికల విధుల నుండి వాలంటీర్లను ఎన్నికల సంఘం తప్పిస్తే..సచివాలయ సిబ్బంది, సెర్ప్ సిబ్బంది, వీఆర్వోలు, వీఆర్యేలతో పంపిణీకి ఎందుకు చర్యలు తీసుకోలేదో సమాధానం చెప్పాలి.
తెలుగుదేశం పార్టీపై నెపం నెట్టడమే లక్ష్యంగా పెన్షన్లు ఆపారు. గతంలో ఒకసారి ప్రజలు మిమ్మల్ని నమ్మారు.ఇప్పుడు మరోసారి నమ్మేందుకు సిద్ధంగా లేరు. కోడికత్తి, వివేకా హత్య లాంటి కేసుల్లో ఏం చేశారో ప్రజలంతా చూశారు. పెన్షన్ దారుల్ని ఎండలో అవస్థలకు గురి చేసిన జగన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో గుణపాఠం తప్పదు. చంద్ర బాబు ఐదేళ్లలో పింఛన్ మొత్తాన్ని రూ.1800 పెంచితే, జగన్ రెడ్డి ఐదేళ్లలో పెంచింది రూ.1000 మాత్రమే. పింఛన్ అనేపదానికి సార్థకత కల్పించింది తెలుగు దేశంపార్టీ మాత్రమే. అప్పుడున్న బడ్జెట్ ఎంత.? ఇప్పు డున్న బడ్జెట్ ఎంత? అంత తక్కువ బడ్జెట్లోనూ ఐదేళ్ల లో రూ1800పెంచితే, రూ.12 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పటికీ పెంచింది రూ.1000 మాత్రమే. మరోవైపు చంద్రబాబు ధరలు పెంచలేదు, పన్నుల భారం మోప లేదు. కానీ నేడు ధరల బాదుడు, పన్నుల వాత, ఛార్జీల మోతతో ప్రజల నడ్డి విరిచారు. చివరికి చెత్త పన్ను అంటూ ప్రజల్ని పీల్చి పిప్పి చేశారు. ఇలాంటి ప్రభుత్వా న్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. విడతల వారీగా పెన్షన్లు పెంపు హామీకి కూడా తిలోదకాలిచ్చి ఒక్కో లబ్ధిదారుడికి రూ.31,500 ఎగ్గొట్టారు. ప్రభుత్వ సిబ్బం దితో ఒక్క రోజులో ఇళ్ల వద్దే అందించే అవకాశం ఉన్నప్పటికీ రాజకీయ కుట్రతో ఇవ్వకుండా దగా చేస్తు న్నారు. తక్షణమే పెన్షన్లు ఇళ్ల వద్ద అందించాల్సిందిగా దువ్వారపు డిమాండ్ చేశారు.
కావాలనే వృద్ధులకు అవస్థలు
బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీఛైర్మన్ వేమూరి ఆనంద సూర్య మాట్లాడుతూ పింఛన్లు ఆలస్యంచేయడం ద్వారా వృద్ధులను అవస్థలకు గురిచేసి, ఆ నెపాన్ని తెలుగు దేశం పార్టీ పైకి నెట్టాలని జగన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. రూ.200 ఉన్న పెన్షన్ చంద్రబాబు రూ.2000 చేశారు. కానీ రూ.3000 చేస్తానని చెప్పిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పెంచింది కేవలం రూ.1000 మాత్రమే. చంద్రబాబుపై నెపం నెట్టాలను కునే జగన్‌రెడ్డి పప్పులు ప్రజల వద్ద ఉడకవన్నారు. వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలేనని ఇదివరకే జగన్ రెడ్డి సహా వైసీపీ నేతలంతా పలుమార్లు చెప్పారు. అందుకే ఎన్నికల కమిషన్ వారిని నేరుగా నగ…