- చంద్రబాబు హయాంలో 71 శాతం పనులు పూర్తి
- దానిని పూర్తి చేయడం జగన్ రెడ్డి, మంత్రుల వల్ల అవుతుందా?
అమరావతి: జగన్‌రెడ్డి అసమర్థ పాలన, అసంబద్ద నిర్ణయాల వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగిందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహిం చిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించారు. గతంలో జగన్ రెడ్డి చేసిన తప్పుడు ఆరోపణలే నేడు పోలవరం ప్రాజెక్ట్‌కి శాపంగా మారాయి. చంద్రబాబు హయాంలో పోలవరానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. పనులు త్వరితగతిన ముందుకు సాగేలా కృషిచేశారు.2014-19 మధ్యకాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్ట్ పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ 71 శాతం పనులను పూర్తిచేశారు.డయా ఫ్రం వాల్ నిర్మా ణం కోసం అంతర్జాతీయ కంపెనీలను తీసుకొచ్చారు. కాఫర్ డ్యాం నిర్మాణ పనులను వేగవంతం చేశారు. రూ.7వేల కోట్లకుపైగా నిధులను ఖర్చు పెట్టారని అన్నారు.
జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజె క్ట్‌పై నిర్లక్ష్య ధోరణిని అవలంబించి పనులు కుంటుప డేలా వ్యవహరించారు.విధ్వేషం, విధ్వంసమే అజెండా ఉన్న జగన్‌రెడ్డి ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్ట్ పనులు ఒక్క శాతం కూడ ముందుకు సాగని పరిస్థితి. నిర్మాణ సంస్థని మార్చొద్దని పీపీఎ హెచ్చరించినా జగన్‌రెడ్డి తన స్వార్థం కోసం, తన బంధువులకు కట్ట బెట్టడం కోసం ఏజెన్సీని మార్చారు. దీని వల్ల ప్రాజెక్ట్ పనుల్లో జాప్యం జరుగుతోందని విమర్శించారు. ఏజెన్సీని మార్చడం వలన 2019జూన్ నుండి 2020 జూన్ వరకు దాదా పు 14 నెలలు పనులు ఆగిపోయాయి. పనులు నిలిపి వేయడంతో వర్షాలకు గుంతలు ఏర్పడి ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. జగన్‌రెడ్డి అధికారంలో ఉన్న మూడున్నరేళ్లలో రూ.2వేల కోట్లను కూడ ప్రాజె క్ట్‌కి వినియోగించలేదు.నీతి ఆయోగ్ సూచనల మేరకు పీపీఏ నియమించిన ఐఐటీ కమిటీ పోలవరం ప్రాజెక్ట్ పనులు జాప్యం కావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి, నిర్ణయాలే కారణమని తేల్చి చెప్పిందన్నారు.