అమరావతి: చంద్రగిరి నియోజకవర్గంలో ఓటర్ల లిస్టులో ఉన్న డూప్లికేట్ ఎంట్రీలని సరిచూసి తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు (సీఈసీ)కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. చంద్రగిరి నియోజకవర్గంతో పాటు, పక్క నియోజకవర్గాల్లో కూడా డీఎస్ఈ, పీఎస్ఈ (డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీస్, ఫోటో సిమిలర్ ఎంట్రీస్) ఎక్కువగా ఉన్నాయని అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. వీటిని తొలగించాలని సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. డూప్లికేట్ ఎంట్రీలు చంద్రగిరి నియోజకవర్గంలోని 798, అలాగే చుట్టు పక్కల నియోజకవర్గాలలో 2840 ఉన్నాయని పేర్కొన్నారు. ఒకసారి నిశితంగా పరిశీలించి చర్యలు తీసుకోవలని అచ్చెన్నాయుడు కోరారు.