అమరావతి : శాసనసభలో రాష్ట్రంలో విషజ్వరాల అంశం చర్చ కు వచ్చినపుడు కొండపి శాసనసభ్యుడు డోలా బాల వీరాంజనేయస్వామి అధికారపక్షం వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డెంగ్యూ మరణాలు ప్రభుత్వం మరణాలే అని అన్నారు. చింతూరు మండలంలో సీఎంను ఆకర్షించిన ఓ పాప కొద్దిరోజులకే డెంగ్యూ తో మరణిస్తే.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మాత్రం మరణాలు లేవని అసత్యాలు చెబుతున్నారు. కొండేపి నియోజకవర్గంలో బొచ్చు సుజాత, పొన్నం శారదలు విషజ్వరాలతో చనిపోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. తెలుగుదేశం హయాంలో సీజనల్ వ్యాధులు తగ్గాయని సీఎం ఇచ్చిన గణాంకాల ద్వారానే తెలు స్తోంది. దోమలపై దండయాత్ర, లార్వాలను నియంత్రించే కార్యక్రమం బ్రహ్మాండంగా చేశాం. తెలుగుదే శం అందించిన ఫలాలే వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు దక్కుతున్నాయి. హామీలివ్వడంలో ప్రభుత్వం ఘనం.. ఆచరణలో మాత్రం శూన్యమని దుయ్యబట్టారు.