- వ్యక్తిగత పూచీకత్తుపై విడుదలకు ఉత్తర్వులు
- 41ఎ నోటీసులు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశం
- చంద్రబాబు, లోకేష్ పేరుచెబితే వదిలేస్తామన్నారు
- మీడియా ఎదుట గళం విప్పిన వెంగళరావు
గుంటూరు: తెదేపా సోషల్ మీడియా కార్యకర్త, ఘర్షణ మీడియా నిర్వాహకుడు బొబ్బూరి వెంగళరావును గుంటూరు సిఐడి కోర్టు విడుదల చేసింది. వ్యక్తిగత పూచీకత్తు ద్వారా వెంగళరావు విడుదల చేయాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. పోలీసుల రిమాండ్ విజ్ఞప్తిని జడ్జి తిరస్కరించారు. జీజీహెచ్ లో వైద్య పరీక్షల అనంతరం యూట్యూబర్, తెదేపా కార్యకర్త బొబ్బూరి వెంగళరావును శనివారం సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. వాదోప వాదనలు అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై వెంగళ రావును విడుదల చేయాలని జడ్జి ఆదేశించారు. పోలీసుల విజ్ఞప్తిని సీఐడీ కోర్టు తిరస్కరించింది. పోలీసులు 41-ఎ నోటీసు ఇచ్చి విచారించాలని న్యాయస్థానం సూచిం చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై వెంగళరావును పోలీసులు అరెస్టు చేశారు. నిన్న కేసు విచారణ సందర్భంగా అతడిని సీఐడీ పోలీసులు హింసించారని మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. దీంతో అతని ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు జీజీహెచ్ తరలించారు. జీజీహెచ్ లో వైద్య పరీక్షల అనంతరం ఇవాళ సీఐడీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఇరువర్గాల వాదనలు విన్నతర్వాత బొబ్బూరి వెంగళరావును వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాల్సిందిగా న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
చంద్రబాబు, లోకేష్ పేరుచెబితే వదిలేస్తామన్నారు
‘‘వైకాపా ప్రభుత్వం అవినీతిని నిత్యం ప్రశ్నిస్తున్నా. అర్ధరాత్రి అరెస్టు చేసి శారీరకంగా, మానసికంగా వేధిం చారు. సీఐడీ పోలీసుల వైఖరి దుర్మార్గంగా ఉంది. చంద్ర బాబు, లోకేశ్ పేరు చెబితే వదిలేస్తామని చెప్పారు. నాపై కేసులకు, తెదేపా నేతలకు ఏమిటి సంబంధం? రాజ ధాని,పోలవరం గురించి ప్రశ్నిస్తే వేధింపులా? వేల కోట్ల ప్రజాసంపద దోచుకుంటుంటే ప్రశ్నించడం తప్పా? అణచివేత అనేది తిరుగుబాటుకు కారణమవుతుందని గ్రహించాలి.’’ అని తెదేపా సోషల్ మీడియా కార్యకర్త వెంగళ్రావు అన్నారు. కొట్టారని కోర్టుకు చెబితే నా కుమారుడ్ని చంపే స్తామని బెదిరించారు.
సీఐడీ పోలీసులు తనని తీవ్రంగా కొట్టారని తెదేపా కార్యకర్త వెంగళరావు న్యాయమూర్తికి ఫిర్యాదు చేయటం కలకలం రేపింది. వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్ చేశారంటూ వెంగళరావుని సీఐడీ అధికారులు గురువారం అర్థరాత్రి అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా సీఐడీ అధికారులు తనను దుస్తుల విప్పి మరీ కొట్టారని కోర్టులో చెబితే రెండేళ్ల కుమారుడ్ని చం పేస్తామని బెదిరించారంటూ న్యాయమూర్తికి విన్నవిం చారు. దీంతో వెంగళరావుకు జీజీహెచ్లో వైద్య పరీక్షలు చేయించి నివేదిక ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. తెదేపా కార్యకర్త బొబ్బూరి వెంగళరావుని సీఐడీ అధికా రులు విచారణ పేరుతో తీవ్రంగా హింసించినట్లు ఆరోప ణలు వచ్చాయి.
నెల్లూరు జిల్లా దుత్తలూరుకు చెందిన బొబ్బూరి వెంగళరావు ఎంబీఐ చదివి బెంగళూరులో ఉంటున్నారు. ఘర్షణ పేరుతో ఓయూట్యూబ్ ఛానల్ ప్రారంభించి వైకాపా ప్రభుత్వ తీరుపై వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. వీటిపై వచ్చిన ఫిర్యాదులమేరకు సీఐడీ పోలీసులు వెంగళరావుని అరెస్టుచేశారు. గురువారం కుప్పంలో జరిగినఘటనను నిరసిస్తూ డీజీపీ కార్యాలయం వద్ద తెదేపాచేసిన ఆందోళనలో వెంగళరావు పాల్గొన్నారు. తిరిగి హైదరాబాదు వెళ్తున్న సమయంలో కోదాడలో సీఐడీ అధికారులు ఆయన్ని అరెస్టు చేశారు. గుంటూ రులోని సీఐడీ కార్యాలయానికి తరలించారు. వెంగళరా వుపై 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సీఐడీ డీఐజీ సునీల్ నేతృత్వంలోని బృందం