- హైదరాబాద్‌లో అడ్డుకుంటున్నారని ఏపీ క్యాబ్ డ్రైవర్ల ఫిర్యాదు
- అమెరికా విద్య పేరుతో కన్సల్టెన్సీ మోసగించిందని విద్యార్థిని ఆవేదన
మంగళగిరి(చైతన్యరథం): ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ మంగళవారం మంగళగి రి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మదనపల్లెకు చెందిన ఎం.ఆర్.లహరి అనే విద్యార్థిని ఉన్నత విద్యకు అమెరికా వెళ్లేందుకు కన్సల్టెన్సీని సంప్రదించగా కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీలో సీటు ఇప్పిస్తామని చెప్పి రూ.30 లక్షలు నిర్వాహకుడు వెంకటరెడ్డి వసూలు చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తీరా చూస్తే ఆ పేరుతో యూనివర్సిటీ లేదని లహరి, ఆమె తల్లి శ్రీమతి లక్ష్మి వాపోయారు. స్పందిం చిన పవన్‌కళ్యాణ్ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాలని అధికారులను ఆదేశించారు. అమెరి కాలో ఉన్న విశ్వవిద్యాలయాలు, కాలేజీల సమాచారం విద్యార్థులకు అందేలా చూడాలని విదేశాంగ మంత్రిత్వ శాఖకు లేఖ రాయాలని నిర్ణయించారు. చిత్తూరు జిల్లాకు చెందిన రిషిత నరాల బలహీనతతో బాధపడుతుండగా తమ బిడ్డకు వైద్యం అందించాలని తల్లి దండ్రులు గోడు వెళ్లబోసుకున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ తమ సమస్యలు వివరిస్తూ వినతిపత్రం అందించారు. ఏపీ డ్రైవర్లను జూన్ 2 నుంచి ఉమ్మడి రాష్ట్ర పరిధి అయిపోయిందని హైదరాబాద్‌లో డ్రైవర్లు అడ్డుకుం టున్నారని ఏపీ క్యాబ్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ స్పందిస్తూ అడ్డుకోవడం సబబు కాదని, తెలంగాణ ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించేలా చొరవ తీసు కుంటామని చెప్పారు.