చిత్తూరు (చైతన్య రథం): కార్వేటి నగరం మండలం డిప్యూటీ సీఎం నారాయణస్వామి సొంత పంచాయతీ అయిన అన్నూరులో వైసీపీకి చెందిన 35 దళిత కుటుంబాలు ఆదివారం టీడీపీలో చేరాయి. అన్నూరు పంచాయతీ మి దళితవాడలో ఇంటింటికి థామస్ కార్యక్రమాన్ని ఆదివారం జీడీ నెల్లూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి డాక్టర్ థామస్ నిర్వహించారు. ఈ సందర్భంగా వీరంతా టీడీపీలో చేరారు. డిప్యూటీ సీఎం సొంత పంచాయతీలో ఎటు చూసినా గుడిసెలు కనబడుతున్నాయని, ఎక్కడ కూడా అభివృద్ధి కనపడటం లేదని థామస్ విమర్శించారు. దళితవాడలో పేదలకు ఇళ్లు ఇవ్వని డిప్యూటీ సీఎం ఎందుకని విమర్శించారు. రాబోవు ఎన్నికల్లో టీడీపీకి ఓట్లువేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి జనార్దన్ రాజు, చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గం తెలుగు మహిళ అధ్యక్షురాలు అరుణ, ఎస్ఆర్పరం మండల పార్టీ అధ్యక్షుడు జయశంకర్ నాయుడు, మండల టీడీపీ అధ్యక్షుడు చెంగల్రాయల్, ప్రధాన కార్యదర్శి రాజేంద్రరెడ్డి, చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గం తెలుగు రైతు అధ్యక్షుడు నాగేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు