అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో వైసీపీ నేతల రెచ్చగొట్టే ధోరణి అత్యంత దుర్మార్గమని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గంలో పర్య టిస్తుంటే జగన్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఘర్షణ వాతావ రణం సృష్టించారన్నారు. పేదవాడి కడుపు నింపేందుకు అన్న క్యాంటీన్ ఏర్పాటుచేస్తే దాన్ని ధ్వంసం చేస్తారా అని మండిపడ్డారు. అన్నం పెట్టాలనుకున్న తెలుగుదేశం పార్టీ నేతలపై దాడులు చేస్తారా? క్యాంటీన్‌ను ధ్వంసం చేస్తారా, అడ్డుకున్న తెలుగుదేశంపార్టీ కార్యకర్తలపై రాళ్లు, కర్రలతో దాడులకు తెగబడతారా అని అడిగారు. టీడీపీ కార్యకర్తపై చేయి వేసిన ప్రతిఒక్కరినీ గుర్తు పెట్టుకుని భవిష్యత్తులో అంతకు అంతా తిరిగి ఇస్తామని హెచ్చరించారు. తెలుగుదేశంపార్టీ కార్యకర్త ఒంటి నుంచి కారిన ఒక్కో రక్తం చుక్క రేపు ఎన్నికల తర్వాత జగన్‌రెడ్డికి పట్టపగలే చుక్కలు చూపించడం ఖాయమన్నారు. ప్రజా స్వామ్యబద్దంగా నడుచుకునే పార్టీపై,పార్టీ నాయకులపై ఇష్టాను సారంగా దాడులుచేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలని పయ్యావులకేశవ్ హెచ్చరించారు.