అమరావతి: బాపట్ల జిల్లా బర్తిపూడిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయటాన్ని టీడీపీ అధినేత నారా చంద్ర బాబునాయుడు తీవ్రంగా ఖండిరచారు. కొందరు దుండగులు బుధవారం అర్థరాత్రి వేళ గ్రామంలోని విగ్రహం తల పగులగొట్టి పరారయ్యారు. ఈఘటనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వెళ్లి ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం సిగ్గుమాలిన చర్య అని చంద్రబాబు మండిపడ్డారు. మహనీయుల పట్ల అగౌర వంగా వ్యవహరించడం వైకాపా అహంకారానికి నిదర్శనమన్నా రు. బాధ్యులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.