• కనిగిరి పట్టణంలోని టకారిపాలెం, దేవాంగనగర్ ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా ప్రాంతంలో 300కుటుంబాలు నివాసముంటున్నాం.
• మాకు వ్యవసాయ భూములు లేవు. రాళ్లకొట్టే పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నాం.
• రాళ్ల పనుల్లో వాయుకాలుష్యం వల్ల చాలా మంది రోగాల బారిన పడుతున్నారు.
• మీరు అధికారంలోకి వచ్చాక మా కుటుంబాలకు జీవనోపాధి కల్పించాలి.
• భూమి లేనివారికి వ్యవసాయ భూములు ఇప్పించాలి.
• మా ప్రాంతంలో 60కుటుంబాలు చేనేత వృత్తి చేసుకుంటున్నారు. వారికి ఆర్థిక చేయూతనివ్వాలి.
• మా ప్రాంతంలో మంచినీరు, డ్రైనేజీ, రోడ్లు సమస్యలు అధికంగా ఉన్నాయి.
• మీరు అధికారంలోకి వచ్చాక మా ప్రాంత సమస్యలు పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇదివరకెన్నడూ లేనివిధంగా పెద్దఎత్తున వలసలు పెరిగాయి.
• గతనాలుగేళ్ల పాలనలో చేతివృత్తి పనివారు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారు.
• టిడిపి అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతంలో పరిశ్రమల స్థాపన ద్వారా వలసలు నివారిస్తాం.
• రాళ్లు కొట్టే కార్మికులకు, చేనేతలకు సబ్సిడీరుణాలతోపాటు ఆరోగ్య బీమా కల్పిస్తాం.
• వాటర్ గ్రిడ్ ఏర్పాటుద్వారా ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి అందజేస్తాం.
• తిరిగి చంద్రన్నను ముఖ్యమంత్రిని చేసేందుకు మీ వంతు సహకారం అందించండి.