జ్యూరిచ్/స్విట్జర్లాండ్ (చైతన్యరథం): స్పెయిన్‌కు చెందిన ఎవల్యూషన్ సినర్జెటిక్ ఆటోమోటివ్ ఎసఎల్ (Evolution Synergetique AutomotiveSL-EVO) సంస్థ ఎండీ జోస్ మెల్లాడోతో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్, జీరో-ఎమిషన్ వెహికల్స్ (ZEV) రంగాల్లో అంతర్జాతీయ స్థాయి భాగస్వామ్యాలను బలోపేతం చేసేందుకు ఆసక్తిగా ఉందన్నారు. రాష్ట్రంలోని లైవ్ పోర్ట్ వాతావరణం, ఇండస్ట్రియల్ పార్కులు, ఇంజనీరింగ్ శాండ్‌బాక్స్‌లను అందిస్తూ ఏపీ గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను సాకారం చేయబోతోంది. కాంప్లెక్ట్ వెహికల్స్, మొబిలిటీ సిస్టమ్స్ అభివృద్ధిలో ప్రత్యేకత కలిగిన ఎవో సంస్థ ఆధ్వర్యాన వైజాగ్/కాకినాడ పోర్టుల్లో హైడ్రోజన్ టెర్మినల్ ట్రాక్టర్స్ పైలట్ వాహనాలను అభివృద్ధి చేయండి. ఏపీ పారిశ్రామిక పార్కుల్లో ఎలక్ట్రిక్/హైడ్రోజన్ ఆఫ్-రోడ్ వాహనాల కోసం కో- పైలట్‌ను అభివృద్ధి చేసి, రీ డిజైన్, ఆప్టిమైజేషన్‌కు నేతృత్వం వహించండి. ఇందుకు అవసరమైన టెస్ట్ బెడ్‌లు, అనుమతులను ఏపీ ప్రభుత్వం అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రారంభదశ ఆవిష్కరణలను ప్రోత్సహించాలని భావిస్తోంది. ఎవో పైలట్లకు మద్దతుగా ప్రొటోటైప్ అభివృద్ధికి, ఇంజనీర్ల శిక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరిస్తుంది. ఇండస్ట్రియల్ లేదా అకడమిక్ క్యాంపస్‌లో చిన్న ఇంజనీరింగ్ శాండ్ బాక్స్‌ను అందిస్తుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.













