అమరావతి : దళితుల అభివృద్ధి అంతా టీడీపీ పాలనా కాలంలోనే జరిగిందని కొండెపి ఎమ్మెల్యే డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. చంద్రబాబు హయాంలో జిల్లా స్థాయిలో ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేయగా వాటిని జగన్‌రెడ్డి నిర్వీ ర్యం చేశారని చెప్పారు.
మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ మాట్లాడుతూ విజయమ్మ చేతిలో బైబిల్ పట్టుకొని ప్రచారం చేసి క్రైస్తవులను మోసం చేసి ఓట్లు వేయిం చుకున్నారని, జగన్ క్రైస్తవుడు కాదని, స్వరూపానం దస్వామి కాళ్ల మీద పడ్డప్పుడే అర్థమయ్యిందని, ఈసారి మోసపోవద్దని అన్నారు.
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై దళితుల దండ యాత్ర ప్రారంభ మయ్యిందని, ఇది తనతోనే ప్రారంభ మయిందని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ నిప్పుకు చెదలు పట్టడడం ఎంత నిజమో చంద్రబాబు అవినీతి చేశారనడం కూడా అంతే నిజమ న్నారు. చంద్రుడికైనా మచ్చ ఉందేమోకానీ చంద్రబా బుకు ఎటువంటి మచ్చా లేదన్నారు.
గూడూరు నియో జకవర్గ ఇంఛార్జ్ పాశిం సునీల్‌కుమార్, పామర్రు ఇం ఛార్జ్ కుమార్‌రాజా, ప్రత్తిపాడు ఇంఛార్జ్ రామాంజినే యులు, గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ఎం.వెంకటేశ్వ రరావు మాట్లాడుతూ దళితులకు ఆత్మగౌరవం దక్కా లన్నా, దళితుల అభివృద్ది జరగలన్నా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నారు. ఎస్సీ సెల్ విభాగం కో ఆర్డినేటర్ నజీర్, అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యల రావు, రాష్ట్ర కార్యదర్శులు దేవతోట నాగరాజు, దాసరి అంజనేయులు, జెన్ని రమణయ్య మాట్లాడుతూ వైసీపీ పాలనలో దళితులపై జరుగుతున్న దాడులను ఏకరువు పెట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శులు సుశీల్‌రావు, మేకల దాసు, దేవతోట సుందయ్య, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు దొప్పలపూడి జ్యోతిబసు, టీడీపీ సీనియర్ దళిత నాయకులు ఆలూరి రాజేష్,బాపట్ల జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సురేష్, మచి లీపట్నం ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆదినారాయణ, ఎన్‌టి ఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సంజయ్ పాల్గొన్నారు.