- పాలనను గాడిలో పెట్టడమే త్యాగధనులకు నిజమైన నివాళి
- స్వాతంత్య్ర వేడుకల్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్
- టీడీపీ కేంద్ర కార్యాలయంలో త్రివర్ణ పతాకం ఆవిష్కరణ
మంగళగిరి(చైతన్యరథం): ఎన్టీఆర్ ఆశయాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి, ఆలోచనా విధానాలతో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల పోరాట ఫలితమే స్వాతంత్య్ర ఫలమన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా పాలన అందిస్తూ.. వ్యవస్థ నిర్మాణం చేసుకుంటూ ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. నిర్వీర్యమైన పాలనను గాడిలో పెట్టడమే ప్రాణత్యాగం చేసిన వాళ్లకు నిజమైన నివాళి అని ఉద్ఘాటించారు. గత ఐదేళ్లు విధ్వంసం, అరాచక పాలన రాజ్య మేలిందని, బ్రిటిష్ పాలనలో రూ.45 లక్షల కోట్లు దోచుకుంటే గత వైకాపా ప్రభు త్వం అంతకంటే ఎక్కువ దోపిడీ చేసిందన్నారు. పాలనను గాడిలో పెట్టేందుకు చంద్రబాబు కృషిచేస్తున్నారని తెలిపారు.
లాల్‌జాన్‌బాషాకు నివాళి
అనంతరం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ లాల్‌జాన్‌బాషా వర్ధంతి సంద ర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు టి.డి.జనార్దన్, వర్ల రామయ్య, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి, మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముస్తాద్ అహ్మద్, నేతలు దేవతోటి నాగరాజు, సప్తగిరి ప్రసాద్, పాతర్ల రమేష్, చప్పిడి రాజశేఖర్, కుప్పం రాజశేఖర్, బుచ్చి రాంప్రసాద్, ఎ.వి.రమణ, మన్నవ సుబ్బారావు, పరు చూరి కృష్ణ, హసన్ బాషా, హనుమంతరావు, దేవినేని శంకర్‌నాయుడు, నర్సా నాయుడు, రాజేంద్రప్రసాద్, ఎస్పీ సాహెబ్, భాస్కరరావు, మీడియా కో ఆర్డినేటర్ దారపనేని నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.