ప్రకృతి విపత్తు అన్నదాతను కోలుకోలేని దెబ్బతీశాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అకాల వర్షాలకు రైతులు అతలాకుతలం అయితే పరామర్శించేవారూ కరువయ్యన్నారు.
లక్షల ఎకరాల్లో కోట్ల పంటకు నష్టం. తడిసి ముద్దయిన ధాన్యం. మొలకెత్తిన మొక్కజొన్న. పసుపు, మిర్చి, అరటి, మామిడి, నాటు పొగాకు ఇతర పంటలకూ నష్టం వాటిల్లిందన్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి బాధిత రైతుల ముఖం చూసిన పాపన పోలేదు. కష్టనష్టాలతో బావురుమంటున్న రైతుల ఆవేదన కనబడుతుందా? జగన్ అని ప్రశ్నించారు.
సాంకేతికతను వినియోగించుకోవాలి: అనిత
టీడీపీ పార్టీ ఆఫీసులో ఇంటిగ్రేటెడ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాంకేతికతను వినియోగించు కోవడంలో టీడీపీ శ్రేణులు ముందు ఉండాలని అనిత అన్నారు. నియోజకవర్గంలో ఏం జరిగినా, సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేయాలన్నారు. సాంకేతికతను వినియోగించు కోవడంలో చంద్రబాబు అగ్రస్థానంలో ఉంటారన్నారు. గెలుపు ఓటములు నిర్ణయించడంలో సాంకేతికత ప్రాధాన్యత ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాలు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమరావతి పార్టీ కార్యాలయం నుండి వచ్చిన వారు నియోజకవర్గ క్లస్టర్,యూనిట్,బూత్ ఇంచార్జ్‌లకు, ఐ టీడీపీ సభ్యులకు ఇతర టీడీపీ శ్రేణులకు శిక్షణా మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.