- మద్యం వ్యాపారాలపై సీబీఐ విచారణ జరిగితే ఏ1, ఏ2 లు శాశ్వతంగా జైల్లోనే
- లోకేశ్ మాటలతో తాడేపల్లి కొంపలో ఆక్రందనలు మొదలయ్యాయి
- తాడేపల్లి కొంపకు సీబీఐ నోటీసులు వస్తున్నాయని తెలిసే విజయసాయి పిచ్చెక్కి మాట్లాడాడు
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుని జైల్లో కలిసిన అనంతరం యువనేత లోకేశ్ మీడియాతో మాట్లాడిరది చూశాక తాడేపల్లి కొంపలో ఆక్రందనలు మొదలయ్యాయని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మీడియా ద్వారా లోకేష్ సంధించిన ప్రశ్నలకు వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళగిరి లోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం దేవినేని మీడియాతో మాట్లాడుతూ సామాజిక సాధికార బస్సు యాత్రలో, విలేకరుల సమావేశంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పిచ్చి ప్రేలాపనలు పేలాడన్నారు. జగన్ రెడ్డి.. విజయసాయి రెడ్డిలు తమకున్న అవలక్షణాలను. ఇతరులకు అంటగట్టేందుకు విషప్రచారాన్ని నమ్ముకు న్నారన్నారు.
అన్యాయంగా 50 రోజుల నుంచీ టీడీపీ అధినేత చంద్రబాబుని జైల్లో పెట్టి తాడేపల్లి ప్యాలెస్ లోని వారు పైశాచిక ఆనందం పొందుతున్నార న్నారు. ప్రభుత్వ న్యాయవాదులతో కోర్టుల్లో పొంతన లేని వాద నలు వినిపిస్తూ, జగన్‌రెడ్డి కావాలనే చంద్రబాబు కేసు విషయంలో కాలయాపన చేస్తున్నాడని ఆరోపించారు.
ప్రజల సొమ్ముని ప్రభుత్వ న్యాయవాదులకు దోచిపెడుతూ.. చంద్రబాబును జైలు నుంచి బయటకు రాకుండా చేయడం కోసం జగన్‌రెడ్డి నానా అవస్థలు పడుతున్నాడు. నేడు ఆ ప్రభావంతోనే విజయసాయి రెడ్డి మీడియా ముందు కొచ్చి పిచ్చికూతలు కూశాడు. చంద్రబాబుకి మద్దతుగా దేశంతో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా లభిస్తున్న ఆదరాభిమానాలు జగన్‌రెడ్డి దాచా లనుకున్నా దాగడం లేదు. ఆదివారం హైదరాబాద్ లో జరగబోయే గ్రాటిట్యూడ్ కన్సర్ట్ కార్యక్రమం నిజంగా జగన్ చెవులు చిల్లులు పడేలా చేస్తుందనడంలో ఎలాం టి సందేహంలేదు.
లోకేశ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే విజయసాయిరెడ్డి టీడీపీ నేతలపై నోరు పారేసుకు న్నాడు. జగన్ అండతో తాను.. మిథున్ రెడ్డి కలిసి చేస్తున్న లిక్కర్ వ్యాపారం గురించి విజయసాయి మాట్లాడగలడా అని దేవినేని ప్రశ్నించారు.
సీబీఐతో విచారణ జరిపిస్తే మద్యం మాఫియా లోగుట్టు వెల్లడవుతుంది
విజయసాయిరెడ్డి.. మిథున్‌రెడ్డిల డిస్టిలరీ నుంచి రోజుకి లక్ష కేసుల కల్తీమద్యం బయటకు వస్తుంటే, 50వేల కేసుల మద్యాన్నే లెక్కల్లో చూపుతున్నారు. బీరా 91అనేరకం బీరు ఊటీ సమీపంలో తయారవుతుంటే, దాన్ని విజయసాయి.. మిథున్‌రెడ్డిలు బూమ్‌బూమ్ బీర్ గా ఏపీలో విక్రయిస్తున్నారు. కేవలం రూ.30, రూ.40 లకు తయారయ్యే బీర్‌ను రూ.200 నుంచి రూ.250కు రాష్ట్రంలో విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో జరిగే మద్యం తయారీ..విక్రయాలపై సీబీఐతో విచారణ జరిపిస్తే విజ యసాయి.. మిథున్‌రెడ్డి.. జగన్‌రెడ్డిల మద్యం మాఫి యా మొత్తం బయటపడుతుంది. రాష్ట్రంలో ఉన్న 20 ప్రధాన డిస్టిలరీలు అన్నీ జగన్‌రెడ్డి.. విజయసాయి రెడ్డి.. వారి బంధువులు.. వైసీపీ నేతల కన్ను సన్నల్లోనే నడుస్తున్నాయి.మద్యం అమ్మకాల ద్వారా వచ్చే సొమ్ము లో ప్రభుత్వ ఖజానాకు జమ అవుతోంది చాలా తక్కువ మొత్తమే. నాలుగున్నరేళ్లలో మద్యం అమ్మకాల రూపం లో వచ్చిన సొమ్మే రూ.లక్ష కోట్లు తాడేపల్లి కొంపకు చేరింది.20ప్రధాన డిస్టిలరీల్లో ఎంతమద్యం తయారవు తోంది.. ఎంత బయటకు సరఫరా అవుతోంది.. ప్రభు త్వానికి ఎంత ట్యాక్స్ కట్టారు.. మద్యం అమ్మకాలతో ఖజానాకు ఎంత వచ్చింది. జగన్‌కు ఎంత ముట్టిందనే వివరాలు బయటపెట్టే దమ్ము, ధైర్యం విజయసాయి రెడ్డికి ఉన్నాయా? విజయసాయిరెడ్డి అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డిని లిక్కర్‌స్కామ్ నుంచి బయట పడేయడాని కి ఏకంగా విభజన చట్టం ప్రకారం ఏపీకి దక్కాల్సిన ఆస్తుల్నే ఢల్లీి పెద్దలకు తాకట్టుపెట్టేశారు. శరత్ చంద్రా రెడ్డి నోరు విప్పితే తమ బండారం బయటపడుతుందని విజయసాయి…జగన్‌లు ఢల్లీి పెద్దలతో లాలూచీ పడిరది నిజం కాదా? ఆదాన్ డిస్టిలరీ విజయసాయి బినామీ లు నడుపుతున్నది నిజంకాదా? ఎస్పీవై రెడ్డికి చెందిన డిస్టిలరీని లాక్కొని దానిద్వారా ఎంత కల్తీ మద్యం తయారుచేశారో విజయసాయి చెప్పాలి. కల్తీ మద్యంతో 30లక్షల మంది పేదల జీవితాలతో జగన్‌రెడ్డి ఆటలా డిరది నిజంకాదా అని దేవినేని ప్రశ్నించారు.
చంద్రబాబే లక్ష్యంగా జైల్లో నడుపుతున్న వ్యవహారాలపై నోరు విప్పవేం?
తాడేపల్లి కొంపకు సీబీఐ నోటీసులు రాబోతున్నా యని తెలిసే విజయసాయిరెడ్డి పిచ్చెక్కి మాట్లాడుతు న్నాడు. నవంబర్ 20, 21 తేదీల్లో హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి హాజరు కావాలని ఇప్పటికే తాడే పల్లి కొంపకు నోటీసులు వచ్చాయని సమాచారం. తానొక రాజ్యసభ సభ్యుడిని అనే విషయం కూడా మర్చిపోయి విజయసాయి మతిలేకుండా మాట్లాడుతు న్నాడు. చంచల్ గూడా జైల్లో జగన్ తోకలిసి 16 నెలలు ఉన్నా కూడా విజయసాయిరెడ్డిలో మార్పురా లేదు. గతంలో జగన్మోహన్‌రెడ్డి లాగా చంద్రబాబు జైల్లో రాజభోగాలు అనుభవించడం లేదు. చంద్రబాబు జైల్లో ఉన్న దృశ్యాలను బయటకు వదిలి పైశాచిక ఆనందం పొందిన జగన్.. విజయసాయిరెడ్డి ఇప్పటికీ రాజమహేంద్రవరం జైల్లో జరిగే పరిణామాలపై స్పం దించడం లేదు. గంజాయి ప్యాకెట్లు జైల్లోకి ఎలావస్తు న్నాయో.. రిమాండ్ ఖైదీ వద్ద పెన్ కెమెరా ఎలా ఉందో… జైలు పరిసరాలపై డ్రోన్ ఎలా ఎగిరిందో జైళ్ల శాఖ డీఐజీ వద్ద.. విజయసాయివద్ద సమాధానం లేదు. సాయంత్రం 6 దాటిన తరువాత జైళ్ల శాఖ డీఐజీ ప్రెస్ మీట్లు పెట్టడం నిబంధనలకు విరుద్ధం కాదా? బయటివ్యక్తులు ఎవరూ సాయంత్రం 6 దాటాక జైలు పరిరసరాల్లో కూడా ఉండటానికి వీల్లేదు. మీడియా ముసుగులో ఎవరు జైల్లోకి వెళ్తున్నారో..ఎక్కడ తిరుగు తున్నారో తెలియదు. చంద్రబాబు ఏసీబీ కోర్టు న్యాయ మూర్తికి రాసిన లేఖ నేరుగా జడ్జికి అందకుండా ప్రభు త్వమే కాలు అడ్డం పెడుతోంది. ఆర్థిక మంత్రి బుగ్గన బంధువు, రాజమహేంద్రవరం జైల్లో ఎందుకున్నాడు? చంద్రబాబు కంటికి శస్త్రచికిత్స చేయాలని ఆయన్ని పరిశీలించిన వైద్యులు చెబితే, అవసరం లేదని జైళ్లశాఖ డీఐజీ ఎలా చెబుతాడు? ఈ ప్రశ్నలకు విజయసాయి సమాధానం చెప్పాలని దేవినేని డిమాండ్ చేశారు.
ఎన్ని వందల కోట్లు జగన్ ఢిల్లీకి పంపాడు?
బెంగళూరు హవాలాబ్రోకర్ విజయకుమార్ ద్వారాఎన్ని వందల కోట్లు జగన్ ఢల్లీికి పంపాడో విజయసాయిరెడ్డి చెప్పాలి. చంద్రబాబుని బయటకు రాకుండా చేయడం కోసం విజయసాయి.. జగన్‌రెడ్డి చివరకు ఢల్లీిలో చేయ కూడని పనులు సైతం చేయడానికి సిద్ధమయ్యారు.
జగనే పెద్ద పెత్తందారు
ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీలకుదక్కాల్సిన రూ.1,14,000 కోట్లను దారి మళ్లించి, పేదల జీవితాలతో చెలగాట మాడిన జగన్‌రెడ్డి కంటే నిజమైన పెత్తం దారు ఎవరూ ఉండరు. సామాజిక న్యాయానికి విలువ లేకుండా చేసి న జగన్..దాదాపు లక్ష బ్యాక్‌లాగ్ పోస్టుల్ని భర్తీ చేయ కుండా పేద యువతకు నమ్మక ద్రోహం చేశాడు. 14 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు.. వక్ఫ్ భూములు.. చర్చిల పరిధిలోని భూముల్ని కబ్జా చేయడానికి జగన్ రెడ్డి.. విజయసాయిరెడ్డి కుట్రలు చేస్తున్నారని దేవినేని ఆరోపించారు.
టీడీపీ అధికారంలోకి రాగానే ఏ1, ఏ2లు తిన్నదంతా కక్కించి శిక్షలు పడేలా చేస్తుంది
చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపి 50 రోజులైనా జగన్ రెడ్డి ఎందుకు ఏమీ పీకలేకపోయాడో విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాలి. ఫైబర్ నెట్ ఎండీ గౌతమ్ రెడ్డి తప్పుడు ఫిర్యాదు చేస్తే దాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబుపై మరో తప్పుడు కేసు పెడ తారా? అమరావతికి రైతులు భూములిస్తే వాటిలో.. రాజధాని నిర్మాణాల్లో తప్పు జరిగిందని దుష్ప్రచారం చేసి తప్పుడు కేసుల పెడతారా? అంగళ్లు ఘటనకు సంబంధించి కింది కోర్టులు..హైకోర్టులో టీడీపీ నేత లకు బెయిల్ వస్తే… బెయిల్ రద్దు చేయించ డానికి జగన్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లి.. వందల కోట్లు ఖర్చు చేసింది నిజంకాదా? వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. విజయసాయిరెడ్డి..జగన్‌రెడ్డిలు కోర్టు ల నుంచి తప్పించుకుంటున్నారు. జగన్‌రెడ్డిపై ఉన్న మొత్తం కేసులు 38. డిశ్చార్జ్ పిటిషన్లు.. బెయిల్ పిటి షన్లు వేస్తూ న్యాయస్థానాల నుంచి తప్పించుకుంటూ బయట తిరుగుతున్నాడు. జగన్‌రెడ్డి.. విజయసాయి రెడ్డిల బాగోతం దాచాలన్నా దాగేది కాదు. సీబీఐ, ఈడీలు వేసిన ఛార్జ్ షీట్లు, తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా జగన్ కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడులపై నోరు విప్పే ధైర్యం విజయసాయి రెడ్డికి ఉందా? జగతి పబ్లికేషన్స్ సహా..ఇతర జగన్ కంపెనీల్లోకి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలోనే వరదలా పెట్టుబడులు ఎలా వచ్చాయో.. ఎందుకొచ్చాయో కోర్టులకు చెప్పగలవా విజయసాయి?వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడి గా ఉన్న అవినాశ్‌రెడ్డిని కాపాడటానికి జగన్‌రెడ్డి డ్రా మాలు ఆడిరది నిజం కాదా? అవినాశ్‌రెడ్డి బెయిల్ రద్దు కావడం.. వివేకా హత్యకేసులో తాడేపల్లి కొంపలో ఉండే రెండు పేర్లు బయటకు రావడం ఖాయం. ఈ చీకటి వ్యవహారాలన్నీ బయటపెట్టి.. జగన్, విజయ సాయిరెడ్డిలు అడ్డగోలుగా తిన్న ప్రజల సొమ్ము మొత్తం టీడీపీ అధికారంలోకి రాగానే కక్కించి, శిక్ష పడేలా చేస్తుందని దేవినేని ఉమా తేల్చిచెప్పారు.