• అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం ఆర్.కె.పురం గ్రామంలోని దేనువకొండ పునరావాస కాలనీ ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• దేనువకొండ గ్రామం గుండ్లకమ్మ ప్రాజెక్టు ముంపు గ్రామం. మాకు అద్దంకి పట్టణానికి 5కి.మీ.ల దూరంలో పునరావాస కాలనీ ఇచ్చారు.
• మా కాలనీలో సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో సమస్యలతో సతమతమవుతున్నాము.
• కాలనీలో వాటర్ ట్యాంకు నిర్మించి 13సంవత్సరాలైంది, ఇప్పటివరకు నీటిసరఫరా లేదు.
• మా గ్రామంలో ఇంకా 400మంది అర్హులకు ఇంటి పట్టాలు ఇవ్వాల్సి ఉంది.
• రాజకీయ కారణాలతో సామాజిక, ఆర్థిక సర్వేలో కొన్ని కుటుబాలను తొలగించారు. దీనివల్ల పట్టాలు రానివారు ఇంకా ముంపు గ్రామంలోనే ఉంటున్నారు.
• ఇంటిపట్టాలు మంజూరు చేసిన వారికి కూడా ఇంకా గృహనిర్మాణశాఖవారు ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇవ్వలేదు.
• శివాలయం నిర్మించి పదేళ్లుగా విగ్రహ ప్రతిష్టచేయకుండా పాడుబెట్టారు. గ్రామదేవతల ఆలయాల నిర్మాణం కూడ చేపట్టలేదు.
• పునరావాస కాలనీ సమీమంలో మాకు ప్రస్తుతం ఎటువంటి భూములు లేవు. చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం.
• మా ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటుచేసి ఉపాధి కల్పించాలి.
• మా కాలనీలో ఎస్సీ, ఎస్టీ, బిసిలకు కమ్యూనిటీ హాలు నిర్మించాలి.
• గ్రామస్తుల వైద్య అవసరాల కోసం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏర్పాటుచేయాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టే సమయంలో ముంపుబాధితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇచ్చి పునరావసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.
• దేనువకొండ బాధితులకు ఇప్పటికీ అర్హులకు ఇళ్లపట్టాలు, ఇళ్లనిర్మాణం చేపట్టకపోవడం అన్యాయం.
• పునారావాసం విషయంలో కూడా పార్టీలు, కులమతాలు చూడటం దారుణం.
• టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ముంపు బాధిత ప్రజలందరికీ ఇళ్లస్థలాలిచ్చి ఇళ్లు నిర్మించి ఇస్తాం.
• ఆర్ కె పురం పునారావస కాలనీలో సౌకర్యాలతోపాటు ఆలయ నిర్మాణం, కమ్యూనిటీ హాలు, హెల్త్ సెంటర్ నిర్మాణాలను పూర్తిచేస్తాం.
• స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటుచేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.