అమరావతి (చైతన్యరథం): ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. విభిన్న రంగాల్లో ప్రతిభాపాటవాలు చాటుతున్న విభిన్న ప్రతిభావంతులకు మొదటి నుంచీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటోందని తెలిపారు. త్రిచక్ర మోటారు వాహనాలు ఇవ్వటంతో పాటు, ఆర్థిక ఆసరా కూడా అందించాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల పింఛన్ రూ.6000కి పెంచాం. దివ్యాంగులను అన్ని విధాలా ఆదుకుంటాం. అవకాశాలు అందిపుచ్చుకుని దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు మంత్రి లోకేష్ పేర్కొన్నారు.