మంగళగిరి(చైతన్యరథం): ఒకరోజు ముందుగానే ఈ నెల 31న శనివారం లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయనున్నట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిరచారు. సెప్టెంబరు 1న ఆదివారం రావడంతో ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు కావడంతో సీఎం ఆదేశాల మేరకు పెన్షన్‌దారులకు ఇబ్బంది కలగకుండా ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీకి నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. లబ్ధిదారులు ఈ నెల 31న పెన్షన్ తీసుకోవాలని, ఒకవేళ ఆ రోజు తీసుకోని వారు ఉంటే వారికి 2వ తేదీన ఇవ్వడం జరు గుతుందని తెలిపారు. ఈ విషయాన్ని పెన్షన్‌దారులు గమనించాలని సూచించారు. భవిష్య త్తులో కూడా ఎప్పుడైనా 1వ తేదీన ఆదివారం వస్తే 31వ తేదీనే పెన్షన్లు ఇచ్చే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుందని వివరించారు. టీడీపీ కార్యాలయంలో ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి అనేక సమస్యలు వస్తున్నట్టు చెప్పారు. అధికా రులతో మాట్లాడి వీలైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు.