- ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, విద్యుత్ సంస్థలు, ఇతరులకు చెల్లించాల్సిన బకాయిల గుట్టు విప్పండి
- ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్‌ప్లాన్ కేటాయింపుల ఖర్చు వివరాలు వెల్లడిరచండి
అమరావతి: ఈ ఏడాది సెస్టెంబర్ చివరికి రాష్ట్రం చేసిన మొత్తం అప్పులగురించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డిని శాసన మండలిలో ప్రతి పక్ష నేత, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. అదే విధంగా ఉద్యోగులకు, కాంట్రా క్టర్లకు, విద్యుత్ సంస్థలకు, ఇతరులకు చెల్లించాల్సిన పెండిరగ్ బకాయిల మొత్తం ఎంతో బహిర్గతం చేయాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్‌ప్లాన్‌లలో కేటాయిం చిన మొత్తాన్ని ఆ వర్గా లకు మాత్రమే ఉద్దేశించిన పథకాలలో ఎంతఖర్చు చేశారు. అందరికి వర్తించే పథకాలకు ఎంత ఖర్చు చేశారో ఈ 4సంవత్సరాల గణాంకాలను ప్రజలకు వెల్లడిరచాలని యనమల కోరారు. ఈ మేరకు బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డికి శనివారం యనమల ఒక లేఖ రాశారు.
అంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళన కరంగా ఉందని రాష్ట్ర ప్రజలందరూ నమ్ముతున్నా రు. కాగ్ సంస్థ 2021-22 ఆడిట్ నివేదికలో ఇచ్చిన గణాంకాలను చూసిన తరువాత గత ఆగ స్టు 23న నేను ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. ఎస్.రావత్‌కి ఒక లేఖ రాసి కొంత సమాచారాన్ని కోరాను. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రధాన ప్రతి పక్షనేతగా ఉన్న నాకు ఆర్థిక శాఖ కార్యదర్శి నుండి ఏ విధమైన సమాధానం రాకపోవడం శోచనీయం. 2021-22 కాగ్ నివేదిక ప్రకారం మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత మూడేళ్ళలోనే రూ.3.25లక్షల కోట్లు అప్పుచేశారని, అప్పు/స్థూల ఉత్పత్తి నిష్పత్తి 40నుండి 45శాతం వరకు ఉందని చూసి ఆశ్చర్యపోయాను. ఐదు సంవత్సరాల పాల నలో తెదేపా ప్రభుత్వం రూ.1.39లక్షల కోట్లు అప్పు చేస్తే ప్రతిపక్షంలో ఉన్న మీరు రాష్ట్ర పరిస్థితి గురించి అసెంబ్లీ సాక్షిగా ఎంత ఆందోళన చెందా రో నాకు ఇప్పటికీ గుర్తుంది. అటువంటిది మూడు సంవత్సరాలలో రెండున్నర రెట్లు అప్పు చేయడమే కాకుండా ఎంత అప్పు చేశారనేది కాగ్ కూడా తన నివేదికలో మార్చుకునే పరిస్థితి వచ్చింది అంటే గణాంకాలను తప్పుగా చూపిస్తున్నారని అర్ధమౌ తుంది.
2021-22 ఆడిట్ తరువాత సంవత్సర న్నర కాలంలో సుమారు రూ.1.25 లక్షల కోట్లు అప్పు చేశారు. అంటే నాలుగున్నర సంవత్సరాల లో 4.5లక్షల కోట్లు అప్పుతో ఈ ప్రభుత్వం నడు స్తోంది. ఇంతే కాకుండా 97ప్రభత్వ రంగ సంస్థల కు గాను కేవలం 30 సంస్థలు మాత్రమే ఆడిట్‌కు లెక్కలు సమర్పించాయని కాగ్ ఆక్షేపించింది. లక్ష కోట్ల రూపాయల అప్పును ప్రతి యేటా చేస్తూ వచ్చే సంవత్సరం నుండి (2024-25) సంవత్సరా నికి రూ.50వేల కోట్లకు మించిన చెల్లింపుల భారాన్ని ప్రజల మీద పెట్టారని కాగ్ చెబుతోంది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరాల ను తెలియజేయాలని కనీసం కాగ్ లెక్కలను నిర్ధా రించాలని నేను ఆర్థిక శాఖ కార్యదర్శిని కోరాను. ఆయన నిర్లిప్తత నా అనుమానాలను మరింత బల పరుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గురించి తెలు సుకోవడం ప్రజల హక్కు.మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థిక పరిస్థితులపై శ్వేత పత్రాన్ని ప్రచురించి గత ప్రభు త్వం కంటే ఎంతో మిన్నగా పరిపాలన కొనసాగిస్తా మని చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. నేను కోరిన విషయాలను ప్రజల ముందు ఉంచ గలిగితే ప్రభుత్వ పరిపాలనపై ప్రజలు బేరీజు వేసుకునే అవకాశం ఉంటుందని లేఖలో యనమ ల పేర్కొన్నారు. తన లేఖకు త్వరలోనే సమాధానం ఇస్తారని ఆశిస్తున్నానన్నారు. గతంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్. రావత్‌కి తాను రాసిన లేఖను ఈ లేఖకు జతపరుస్తున్నట్లు యనమల తెలిపారు.