చిత్తూరు : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చిత్తూరుజిల్లాలో దొంగచేతికి తాళాలిచ్చారు. పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి కీలకమైన గనులశాఖా మంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో ఇసుక, గనుల పరిస్థితి కంచే చేనుమేసిన చందంగా తయారైంది. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పుంగనూ రు పట్టణం మేలుపట్ల చెరువులో గత 2 సంవత్సరాల నుండి అక్రమ ఇసుక రవాణా సాగి స్తున్న నేపథ్యంలో సహనం చచ్చిపోయిన స్థానికులు తిరగబడ్డారు. అక్రమంగా ఇసుక తవ్వుతున్న జేసిబీ, ఇసుక ట్రాక్టర్లను బుధవారం నిర్బంధించారు. అథికారులు వివరణ ఇచ్చేదాక వదిలే ప్రసక్తే లేదని స్థానికులు తెగేసి చెప్పారు. పుంగనూరు పట్టణం తమ ఊరి చెరువుకు అధికారిక ఇసుక రీచ్ లేకపోయినా రోజూ వందలాది వాహనాల్లో ఇసుకను తవ్వేసి దర్జాగా తరలిస్తుండటం తో ఇటీవల గ్రామస్థులు కలెక్టర్, ఎమ్మార్వోకు వినతి పత్రం సమర్పించారు. అయితే మంత్రి పెద్దిరెడ్డికి సం బంధించిన వ్యవహారం కావడంతో గ్రామస్థుల వినతి ని అధికారులు చెత్తబుట్ట దాఖలుచేశారు.దీంతో ఓపిక నశించిన గ్రామస్థులు ఇంటికొకరు చొప్పున తమ ఊరి చెరువుకోసం ధైర్యంగా ముందుకు వచ్చారు. ఇసుక వాహనాలను నిలబెట్టేశారు.గనులశాఖ మంత్రే ఇసుక దొంగగా మారితే జనం ఎవరికిచెప్పు కోవాలి? మంత్రి పెద్దిరెడ్డి దోపిడీ పర్వాన్ని తెలుగు ఓదేశం పార్టీ తీవ్రంగా నిరసిస్తోంది. ఆందోళన చేస్తున్న స్థానికులకు టిడిపి సంఫీుభావం ప్రకటిస్తోంది.