- అభివృద్ధితో పాటు సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యం
- పెనుకొండలో అభివృద్ధి పనులను ముమ్మరం చేస్తాం
- చేనేత జౌళి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ
పెనుకొండ(చైతన్యరథం): పెన్షన్ల పంపిణీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చేనేత జౌళి, బీసీ సంక్షేమ మంత్రి సవితమ్మ అన్నారు. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజక వర్గం పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలోని మంగళవారం 12, 13వ వార్డులలో వరుసగా నాలుగో నెల ఒకటో తేదీనే ఇంటి వద్దకే వచ్చి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మంత్రి సవితమ్మ మాట్లాడుతూ చంద్రన్న ప్రభుత్వం ఎలా ఉంది, పెన్షన్ ఎంత వస్తోంది, సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం 40 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని, ఇచ్చిన మాట తప్పి జగన్ మడ మ తిప్పారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లను పెంచి మాట నిలబెట్టుకున్నారని ప్రశంసించారు. రాష్ట్రాన్ని ఒక పక్క అభివృద్ధి బాటలో నడిపిస్తూ సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నారని తెలిపారు. గత ఐదేళ్ల వైసీపీ ప్రభు త్వంలో అభివృద్ధి కుంటుపడిరదని విమర్శించారు.
అమృత్ స్కీం ద్వారా ఇంటింటికీ కొళాయిలు
పెనుకొండ టౌన్‌లో అమృత్ స్కీం ద్వారా రూ.87 కోట్లతో ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకులు, పైపులైన్ ద్వారా ఇంటింటికీ కొళాయిలు ఏర్పాటు చేసి తాగునీటి అందజేస్తామని చెప్పారు. సెంట్రల్ లైటింగ్‌కు రూ.10 లక్షలతో ప్రతిపాదనలు కూడా పంపామని తెలిపారు. డివైడర్లకు మధ్యలో ప్లాంటేషన్ కోసం లక్ష రూపాయలు, డ్రైనేజ్ అండ్ డీ షెల్టింగ్‌కు రూ.11 లక్షలు కేటాయించామని వివరించారు. అదేవిధంగా రైల్వేస్టేషన్ రోడ్డు, కోనాపురం రోడ్డుకు ప్రతిపాదనలు పంపామని, రూ.6 కోట్లతో మూడు అంతస్తులతో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణం కోసం టీటీడీ వారు ఆమోదించినట్టు తెలిపారు. పెనుకొండలో పేద విద్యార్థుల కోసం ఒక ఎంజేపీ స్కూల్ కూడా తెచ్చామని, ఇస్కాన్ సహకారంతో కొండమీద లక్ష్మీనరసింహస్వామి ఆలయం నిర్మిస్తా మని వెల్లడిరచారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.