- సాయంత్రం 6 తరువాత ఆఫీస్‌లో ఉండొద్దు
- ఆ టైం తరువాత నేనూ ఉండను..
- రాజ్యాంగ దినోత్సవాన సిబ్బందికి చంద్రబాబు ఉద్బోధ
అమరావతి (చైతన్య రథం): ఉద్యోగులూ హార్డ్‌వర్క్ వద్దు స్మార్ట్ వర్క్ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హితబోధ చేశారు. గతంలో ఎక్కువ గంటలు కార్యాలయంలో ఉండి పనిచేసే సంస్కృతి ఉండేదని.. ఇప్పుడు టెక్నాలజీ కారణంగా ఆ అవసరం లేదని సీపం అన్నారు. 6 గంటల తరువాత ఎవరూ కార్యాలయాల్లో ఉండొద్దనేది ఇప్పుడు తన విధానమని సీఎం చెప్పారు. సచివాలయ ఉద్యోగులు సహా ఏ ప్రభుత్వ ఉద్యోగీ ఎక్కువ గంటలు కష్టపడాల్సిన పనిలేదని…. స్మార్ట్‌వర్క్ ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని సీఎం అన్నారు. తాను కూడా సచివాలయం నుంచి 6 గంటలకే ఇంటికి వేళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నాని ముఖ్యమంత్రి వివరించారు. రాజ్యాంగ దినోత్సవ సభలో ప్రభుత్వోద్యోగులు, అధికారుల గురించి మాట్లాడుతూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.