కడప: రహదారి విస్తరణ పేరుతో మున్సిపల్ అధికారులు ఇళ్ల కూల్చివేయడాన్ని నిరసిస్తూ స్థానిక టీడీపీ నేతలు ప్రజలతో కలిసి రోడ్‌పై ధర్నా నిర్వహించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇష్టానుసారంగా ఇళ్లను కూల్చివేస్తే తాము ఎక్కడికి పోవాలని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు స్టే ఇచ్చినా కూల్చివేతలకు మున్సిపల్ అధికారులు యత్నించడం దారుణమన్నారు. కూల్చివేతలపై తాము మరోసారి కోర్టుకు వెళ్తామని, మున్సిపల్ సిబ్బంది కూల్చివేతల ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ధర్నా నిర్వహిస్తున్న వారిపై పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడిరది. ఆందోళనకారుల్ని పోలీసులు స్టేషన్‌కు తరలించారు.