- మూడు రాజధానులకు సౌత్ ఆఫ్రికా ఆదర్శం అంటావ్
- మరి అన్నా క్యాంటీన్లకు తమిళనాడును ఎందుకు ఆదర్శంగా తీసుకోలేదు
- లాభం ఉంటే సీఎం జగన్ పనులు చేస్తారు
- ధర్మవరంలో ఆర్‌ఓ ప్లాంట్లు ద్వారా ప్రజలకు మంచినీరు ఇస్తాం
- ధర్మవరంలో అన్నా క్యాంటీన్ ప్రారంభం సందర్భంగా పరిటాల శ్రీరామ్
ధర్మవరం: మూడు రాజధానుల విషయంలో తనకు సౌత్ ఆఫ్రికా ఆదర్శం అని చెబుతున్న సీఎం జగన్.. మరి తమిళనాడును చూసి కూడా అన్నా క్యాంటీన్లను ఎందుకు కొనసాగించలేదని ధర్మవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ సీఎం జగన్ ను ప్రశ్నించారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్ట ణంలో అన్నా క్యాంటీన్ సోమవారం శ్రీరామ్ ప్రారం భించారు. స్థానిక టీడీపీ నాయకులతో కలసి శ్రీరామ్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఇక్కడ ప్రజలకు ఉచితంగా అన్నం అందించేలా చూస్తామని టీడీపీ నాయకులు అన్నారు. ఈసందర్భం గా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ పేద వాడి ఆకలి తీర్చేందుకు తమిళనాడులో అమ్మ క్యాంటీ న్లు ఏర్పాటు చేశారని.. అదే విధంగా గత ప్రభు త్వంలో చంద్రబాబు మన రాష్ట్రంలో కూడా అన్న క్యాంటీన్లను ప్రారంభించారన్నారు. కానీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ క్యాంటీన్లను మూసివేశారన్నారు. అక్కడక్కడ టీడీపీ నేతలు దీనిని నడిపే ప్రయత్నంచేస్తున్నా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తమిళనాడులో జయలలిత ప్రారంభించిన అమ్మ క్యాంటీన్లను వారి ప్రత్యర్థిగా ఉన్న స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా కొనసాగిస్తున్నారని గుర్తుచేశారు. మరి ఏపీలో సీఎంజగన్ ఎందుకు ఇలా చేయలేదని నిలదీశారు. మూడు రాజధానులకు సౌత్ ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకున్నామని చెప్పిన జగన్ పక్క రాష్ట్రాలను ఎందుకు ఆదర్శంగా తీసుకోలేదని ప్రశ్నించారు. సీఎం జగన్‌కు లాభం ఉన్న పనులు మాత్రమే చేస్తారని.. ప్రజలకు మంచి జరిగే పనులు ఆయనకు అవసరం లేదన్నారు. మరోవైపు రాప్తాడు నియోజక వర్గంలో టీడీపీ హయాంలోఅన్ని ప్రాంతాల్లో ఆర్‌ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజలకు మంచి నీరు అందించిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే వైసీపీ వచ్చిన తరువాత వాటిని తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాప్తాడు తరహాలోనే ధర్మవరం నియోజకవర్గంలో కూడా తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్‌ఓ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.