రాష్ట్రంలో జగన్‌రెడ్డి ప్రతిపక్ష, అధికార పక్షంలో ఉన్నప్పుడు జరిగిన కొన్ని ఘటనలను ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరు. వాటిపై నమోదైన కేసుల్లో విచారణలు కోర్టుల్లో ఏళ్ల తరబడి అడుగు ముందుకుపడని పరిస్థితి. అటువంటి వాటిల్లో జగన్‌రెడ్డిపై కేసుల అంశం ఒకటి. ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్న అవినీతి కేసులకు సంబంధించి కోర్టుల్లో విచారణలు, కేసుల్లో దర్యాప్తులు ఎన్నో ఏళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. తిరుమల కల్తీ నెయ్యి విషయంలో తప్పులను కప్పిపుచ్చుకుంటూ ఆ నెపాన్ని అధికార పక్షంపై తోసేందుకు వక్రభాష్యాలు చెబుతూ ప్రధాని మోదీకి లేఖ రాసినట్టు చెబుతున్న ఆయన..తనపై ఉన్న అవినీతి కేసుల్లోనూ అమాయకుడినని, తనను అక్రమంగా కేసుల్లో ఇరికించారని, సీబీఐ విచారణను పారదర్శకంగా చేయించాలని లేఖ రాసే దమ్ముందా? అంటే జవాబు ఉండదు. కల్తీ లడ్డూ పాపం జగన్‌రెడ్డిదే అంటే చాలు…ఆయన ప్రమేయం లేని, ఆయన చేతులతో రాయని లేఖను వైసీపీ పేటీఎం బ్యాచ్ మీడియాకు వదులుతుంది. ఎంత సుద్ధపూస కాకపోతే సీబీఐ విచారణ కోరతాడు? అని రాష్ట్ర ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తుంది. అయినా ఆ ప్రచారాలను ప్రజలు నమ్మని పరిస్థితి. శ్రీవారి నెయ్యి కల్తీ విషయాన్ని నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణ చేయించాలని ప్రధానికి లేఖ రాసిన విషయం నిజమైతే ఈ కింది కేసుల్లోనూ ప్రధానికి లేఖ రాసి తన నిజాయితీని నిరూపించుకునే దమ్ముందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
వివేకా హత్య కేసు
సొంత చిన్నాన్న వివేకానందరెడ్డి 2019 మార్చి 15న అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు సంబంధించిన నిందితులు ఎవరు అన్న ప్రశ్న తలెత్తితే అందరి వేళ్లూ తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తాయి. జగన్‌రెడ్డి, భారతీరెడ్డి, అవినాష్‌రెడ్డి, జగన్ అను చరులు ఎవరైతే నేడు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారో, ఎవరైతే నేడు దొంగ సాకులు చెప్పి బెయిల్‌పై బయట ఉన్నారో వారి చుట్టూనే తిరుగుతుంది. జగన్మో హన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సీబీఐ విచారణ కోరి..అధికారంలోకి వచ్చాక ప్లేటు పిరాయించి సీబీఐ విచారణ నిలిపేసి కేసును నేటికీ తేలకుండా చేశాడనే విషయం సుస్పష్టం. తిరుమల కల్తీ నెయ్యి ఘటనలో సంబంధం లేదంటున్న జగన్‌రెడ్డికి వివేకా హత్య కేసులో తనకు లేదా తాడేపల్లి ప్యాలెస్‌కు, తన అనుచరులకు, కుటుంబసభ్యులకు ఎవరికీ సంబంధం లేదని, దీనిపై వెంటనే సీబీఐ విచారణ చేయించి యుద్ధప్రాతిపదికన నిందితులు ఎవరో తేల్చి కఠినంగా శిక్షించాలని ప్రధాని మోదీకి లేఖ రాసే దమ్ముందా?
కోడికత్తి డ్రామా
జగన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రజాసంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహించిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పట్లో విశాఖ ఎయిర్‌పోర్టులో జనిపల్లి శ్రీని వాసరావు(కోడికత్తి శ్రీను) ఉద్దేశపూర్వకంగా టీడీపీ ప్రలోభాలతో జగన్‌పై కోడికత్తితో దాడి చేశాడని వైపీపీ నాయకులు, కార్యకర్తలు అరిచి గగ్గోలు పెట్టారు. ఇదే కోడికత్తి కేసులో తనకు అన్యాయం జరిగిందని భావిస్తే.. ఉద్దేశపూర్వకంగా చంపాలని ప్రయత్నం చేశాడు అని భావిస్తే కోర్టుకు రావాలని ఎన్‌ఐఏ కోరితే జగన్ వెళ్లలేదు. కోడికత్తి శ్రీనును ఐదేళ్ల పాటు బెయిల్ రాకుండా రాజమండ్రి జైలులో మగ్గబెట్టి హింసించారు. ఈ కేసు వెనుక రాజకీయ కోణం, స్వార్థం అనే అంశాలు లేవని, తనకు..తన పార్టీ నేతలకు దాడితో ఎలాంటి సంబంధం లేదని..సీబీఐ విచారణ చేయించి కుట్ర చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రధానికి లేఖ రాసే దమ్ముందా?
ప్రకాశం బ్యారేజీని కూల్చే కుట్ర
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 42 సెంటీమీటర్ల వర్షపాతం ఈ ఏడాది నమో దైంది. రాష్ట్రమంతా భారీ వర్షాలకు చిగురుటాకులా వణికిపోయింది. విజయవాడ నగరం ఊహించని విధంగా బుడమేరు ముంపునకు గురై జలదిగ్బంధంలో చిక్కుకుని అల్లాడిపో యింది. బుడమేరు ఆధునీకరణకు సంబంధించి చిన్న పని కూడా తన ఐదేళ్ల పాలనలో చేయని జగన్‌రెడ్డి వైఫల్యం కారణంగానే విజయవాడ గండ్లు పడి వరదలకు మునిగిపో యిన పరిస్థితి. రాష్ట్రమంతా జగన్‌రెడ్డి వైఫల్యాలను ఎండగడుతున్న వేళ విజయవాడ ప్రకాశం బ్యారేజీని బోట్లతో కూలదోసి వరద నష్టాన్ని మరింత పెంచి లక్షలాది మంది ప్రజలను చంపేసి ఆ నెపాన్ని కూటమిపై నెట్టే ఓ పెద్దకుట్రకు తెరలేపడం తెలిసి బెజవాడ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దాదాపు 50 టన్నుల బరువున్న భారీ బోట్లు 4 ప్రకాశం బ్యారేజీని అమాంతం ఢీకొట్టాయి. దీంతో బ్యారేజీ కౌంటర్ వెయిట్ దిమ్మెలు విరిగిపోయా యి. జగన్మోహన్‌రెడ్డి, వైసీపీ నాయకులు తలశిల రఘురాం, నందిగం సురేష్, కొంత మం ది వైసీపీ కార్యకర్తలు కుట్రపూరితంగా ఈ దారుణానికి పాల్పడ్డారన్నది వాస్తవం. లక్షలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా చేసిన ఈ భారీ కుట్ర వెనుక జగన్ హస్తం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటనపై సీబీఐ విచారణ చేయించి కుట్రకు పాల్పడిన వారిని తేల్చి కఠినంగా శిక్షించాలని కోరే దమ్ము జగన్‌రెడ్డికి ఉందా?
గులకరాయి డ్రామా
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు వస్తే చాలు జగన్‌రెడ్డి లేదా తన కుటుంబంలో ఎవరో ఒకరికి ఏదో ఒకటి జరగడం ఆనవాయితీ. ఈ ఎన్నికలకు ముందు విజయవాడ సింగ్‌నగర్ ప్రాంతంలో జగన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఓ చిన్న గులకరాయితో ఎవరో ఆయనపై దాడి చేశారని గులకరాయి డ్రామాకు తెరలేపింది. ఒక కన్నుకు దెబ్బ తగిలితే మరో కన్నుకు కట్టుకున్న ఆస్కార్ లెవల్ నటుడు వైసీపీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్..టీడీపీ వాళ్లే కుట్రపూరితంగా జగన్‌రెడ్డిపై గులకరాయితో దాడి చేయించారని వైసీపీ నేతలు అప్పటి ప్రతిపక్ష పార్టీపై సానుభూతి డ్రామాకు తెరలేపడం అందరూ గమనిం చారు. సానుభూతి కోసం కుట్రపూరితంగా ఆయనపై ఆయనే దాడి చేయించుకున్నాడని టీడీపీ ఆరోపించింది. ఆ తర్వాత వైసీపీ నుంచి, జగన్ నుంచి ఎలాంటి స్పందనా లేదు. నిజంగా గులకరాయి వ్యవహారం వెనుక జగన్ హస్తం, వైసీపీ నేతల హస్తం లేదు అని గట్టిగా నమ్మితే గులకరాయి విషయంపై తక్షణమే సీబీఐ విచారణ చేయించి కుట్రదారులు, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరే దమ్ము జగన్‌కు ఉందా?
సీబీఐ విచారణ కోరితే దోషులు ఎవరో తేలుతుంది
తనపై ఆరోపణలు వచ్చినప్పుడు సీబీఐ విచారణలు కోరడం, తాను దోషినని తేలే సమయానికి విచారణలు వద్దు అని అడ్డం తిరగడం జగన్‌రెడ్డికి అలవాటే. ఇలాంటి వ్యక్తి ప్రధానికి లేఖ రాసినంత మాత్రాన తప్పు చేయలేదని రాష్ట్ర ప్రజలు నమ్ముతారనుకోవడం పొరపాటు. ఒకవేళ తాను నిజాయితీపరుడనే నమ్మకం ఉంటే పైన పేర్కొన్న కేసుల్లో తక్షణ మే సీబీఐ విచారణ కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాస్తే ప్రజలకు వాస్తవాలు బోధపడతా యి. కుట్రదారుడు ఎవరు? హంతకుడు ఎవరు? దోపిడీదారు ఎవరు? హంతకులను కాపాడే దుర్మార్గుడు ఎవరు? అధికారాన్ని దుర్వినియోగం చేసింది ఎవరు? కోర్టులకు వెళ్ల కుండా కేసుల నుంచి తప్పించుకు తిరిగే వ్యక్తి ఎవరు? అన్న విషయాలపై రాష్ట్ర ప్రజలకు ఓ అవగాహన వస్తుంది. దోషులు ఎవరో, నిర్ధోషులు ఎవరో తేలిపోతుంది. మరి జగన్ రెడ్డి సచ్చీలుడు అయితే ప్రధాని మోదీకి ఆయా కేసుల్లో సీబీఐ విచారణ కోరేందుకు సిద్ధమా?
– మునీంద్ర కొడాలి, పొలిటికల్ అనలిస్ట్