- ప్రత్యేక హోదా తెస్తామని మోసంచేసినవారు రాజీనామా చేయాలి
- విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర దోపిడీ కోసమే 3 రాజధానులు
- మాట మీద నిలబడిన వారు కాదు, మాట తప్పినవారు రాజీనామా చేయాలి
- విశాఖ కేంద్రంగా జరిగే భూదోపిడీపై సీబీఐ విచారణ జరిపించాలి
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి: తక్షణం శాసనసభను రద్దుచేసి మూడు రాజధానులకు ప్రజల మద్దతుకోరుతూ ఎన్నికలకు వెళ్లేధైర్యం జగన్‌రెడ్డి అండ్ కోకు ఉందాఅని తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిం జరాపు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. మంగళగిరి లోనిపార్టీ జాతీయకార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో సోమ వారం జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు,నక్కా ఆనంద్‌బాబులతో కలిసి ఆయన మాట్లాడారు. ఆయన మాటలు యథాతథంగా…తన ధనదాహం, భూ దోపిడీ కోసం జగన్‌రెడ్డి వికేంద్రీకరణ ముసుగులో మూడు రాజధానుల జపం చేస్తున్నారు. ఆయన విసిరే పదవుల కోసం ఆశపడుతున్న వైసీపీ నేతలు,పదవులు పోతాయ న్న భయంతో బొత్స, ధర్మాన, తమ్మినేని లాంటివారు ఉత్తరాంధ్రవాసుల్ని రెచ్చ గొడుతున్నారు.అమరావతి రైతులపై అవాకులు,చవాకులు మాట్లాడుతున్నారు. అధి కారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల్లో తనపై వ్యతిరే కత వచ్చినప్పుడల్లా,దాన్ని పక్కదారి పట్టించడానికి ఏదో ఒక అంశాన్ని తెరపైకి తేవడం ముఖ్యమంత్రికి అలవా టుగా మారింది.ముఖ్యమంత్రిపై, ప్రభుత్వంపై తీవ్రవ్యతి రేకత ప్రజ ల్లో వ్యక్తమవుతోంది. తాను, తన ప్రభుత్వం సాగిస్తున్న దోపిడీ,ప్రజాకంటక పాలన నుంచి ప్రజలు, మీడియా దృష్టి మళ్లించడానికే చేతగాని దద్దమ్మ లైన ముఖ్య మంత్రి,మంత్రులు మూడు రాజధానుల రాగం ఆలపిస్తున్నారు. వికేంద్రీకరణ జపంచేస్తున్నారు. ఈ స న్నాసులంతా వాస్తవాలు తెలుసుకోవాలి. అసలు పరిపా లనా వికేంద్రీకరణకు ఆద్యుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని తెలుసుకోండి. ప్రజల వద్దకు పాలన పేరుతో ప్రజల్ని, ప్రజా ప్రతినిధుల్ని ప్రజలకు చేరువ చేసింది చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు ప్రజలు తమకు సమ స్య వస్తే ఎక్కడికి పోవాలో, ఎవరికి చెప్పాలో తెలియక ఇబ్బందులుపడ్డారు. మండల వ్యవస్థ ఏర్పాటుతో ప్రజ లకు సుపరిపాలన అందించింది తెలుగుదేశంపార్టీ.సాం కేతికత సాయంతో ప్రజలకు వచ్చిన సమస్యల్ని ఎప్పటి కప్పుడు చంద్రబాబు పరిష్కరించారు.అదీ వికేంద్రీకరణ అంటే.కేంద్రప్రభుత్వం స్థానికసంస్థలకు ఇచ్చిన రూ.12 వేలకోట్లను జగన్‌రెడ్డి దారిమళ్లించాడు. అభివృద్ధి వికేం ద్రీకరణ పేరుతో జగన్‌రెడ్డి ప్రాంతాలు, ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారు. విభజ నానంతరం ఏర్పడిన రాష్ట్రానికి రాజధానిలేని సమయంలో నిండు శాసనసభ లో రాజధాని ఏర్పాటుపై చర్చించొ.అన్నిపార్టీలు,5 కోట్ల ప్రజల ఆమోదంతో అమరావతిని రాజధానిగా ఎన్నుకు న్నారు. టీడీపీ ప్రభుత్వంలో శ్రీకాకుళంనుంచి చిత్తూరు వరకు అన్ని జిల్లాలకు వివిధరకాల పరిశ్రమలు వచ్చా యి. మా హయాంలో 5లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ఈ ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకుంది.
విశాఖను పెట్టుబడుల కేంద్రం, ఆర్థిక రాజధానిగా నిలిపాం
అనంతపురం జిల్లాకు కియా పరిశ్రమను, కర్నూ లుకు విత్తనాభివృద్ధి కేంద్రాన్ని, మెగాసోలార్ పార్క్ ను తీసుకొచ్చాం.విశాఖను పెట్టుబడుల కేంద్రంగా నిలిపి, ఆర్థిక రాజధానిగా దేశంలోనే పది అగ్రనగరాల జాబి తాలో నిలిపాం.తిరుపతిలో ఎలక్ట్రానిక్ హబ్, కోస్తాలో పోర్టులు,పోలవరం నిర్మాణం,కాకినాడకు పెట్రోకెమిక ల్ ప్రాజెక్ట్.. ఇలా చెప్పుకుంటూ పోతేచాలా ఉన్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇది. ప్రభుత్వానికి లేని అధికారంతో రాజధాని పేరుతో కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలను ప్రజలంతా గమనిం చాలి. రాజధాని మార్చాలంటే రాజ్యాంగ సవరణ చే యాలని హైకోర్టు, సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పాయి. సాక్షాత్తూ వైసీపీఎంపీ విజయసాయిరెడ్డి,ఏపీకి మూడు రాజధానులు పెట్టాలనుకుంటున్నామని,అలాచేసే అధి కారం ఆ రాష్ట్రానికి ఇవ్వాలని రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు పెట్టింది నిజంకాదా?
సీఎం అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలి
మూడున్నరేళ్లలో చేసిన కుంభకోణాలు,పన్నులతో, బాబాయ్ హత్యతో దేశంలో ఏ ప్రభుత్వంపై రాని వ్యతి రేకత వైసీపీ ప్రభుత్వంపై వచ్చింది.తన అవినీతి,హత్య రాజకీయాలు బయటకు రాకూడదనే జగన్‌రెడ్డి 3రాజ ధానులు అంటున్నాడు.జగన్‌రెడ్డి నిజంగా మాట మీద నిలబడేవాడు అయితే, తక్షణమే అసెంబ్లీని రద్దు చేసి, మూడు రాజధానుల రిఫరెండంపై ఎన్నికలకు వెళ్లాలి. ప్రజలు ఆయనఆలోచనలు అంగీకరించి ప్రజలు గెలి పిస్తే, తాముకూడా వారు చెప్పినట్లే నడుస్తాం. 2019 లో అమరావతే రాజధాని అని టీడీపీ ఎన్నికలకు వెళ్లింది. 2024లో కూడా అలానే వెళ్తుంది. మాట్లాడి తే నన్ను రాజీనామా చేయమని పిచ్చిపిచ్చిగా మాట్లా డుతున్నారు. అమరావతిని అంగుళం కూడా కదిలిం చమని, రాజధాని అభివృద్ధి చేసి ఉద్యోగాలు, పరిశ్రమ లు తీసుకొస్తామని చెప్పింది మీరా? మేమా? నోటి కొచ్చినట్లు మాట్లాడుతున్న మంత్రులు బొత్స, ధర్మాన, స్పీకర్ తమ్మినేని అధికారం ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాట్లాడతారు.ఉత్తరాంధ్రకు జగన్‌రెడ్డి అన్యా యం చేసినప్పుడు, కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాం ట్‌ను ప్రైవేటీకరించినప్పుడు ఆ ప్రాంత వైసీపీ నేతలకు రాజీనామాలు గుర్తు రాలేదా?
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్‌ను జగన్‌రెడ్డి నాశనం చేసినపుడు మంత్రులు ఎందుకు రాజీనామా లు చేయలేదు? 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానన్న వ్యక్తి, ఇప్పుడు మోదీ ముందు నోరెత్తని దుస్థితిలో ఉన్నాడు. హోదా తీసుకురాలేని వారు, రైల్వేజోన్ సాధించలేని అసమర్థులు రాజీనామా లు చేయాలి. మంత్రి పదవి ఇవ్వక ముందు ధర్మాన నోటికి ప్లాస్టర్ వేసుక్కూర్చున్నాడు. ఇదే ధర్మాన, బొత్స సత్యనారాయణ గతంలోకాంగ్రెస్‌లో ఉన్నప్పుడు జగన్ రెడ్డిని, ఆయన కుటుంబాన్ని ఏమన్నారో ప్రజలకు తెలి యదా? చంద్రబాబు ఉత్తరాంధ్రకు తీసుకొచ్చిన ప్రాజె క్ట్‌లన్నీ జగన్ ధనదాహంతో, అవినీతితో ఇతర ప్రాం తాలకు తరలిపోవడం వాస్తవం కాదా? విశాఖ నగరా న్ని ఐటీ కేంద్రంగా తీర్చిదిద్ది, పెట్రో కారిడార్, మెడ్ టెక్ జోన్, లులూ గ్రూప్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, అదానీ డేటాసెంటర్,ఫిన్ టెక్ వ్యాలీ, మిలీనియం ఐటీ టవర్స్ తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వం కాదా? విశాఖలో మూడుసార్లు సీఐఐ సమ్మిట్ నిర్వహించాం.
అమరావతి రైతులు దైవదర్శనానికెళితే మీకెందుకు నొప్పి?
అమరావతి రైతులు పాదయాత్రగా దైవ దర్శనాని కి వెళ్తే మీకెందుకు నొప్పి? పైసా తీసుకోకుండా రాజ ధానికి భూములివ్వడం రైతులు చేసిన తప్పా? మూడే ళ్లు మంత్రిగా ఉన్న బొత్స విశాఖపట్నానికి, ఉత్తరాం ధ్రకు ఏం చేశాడు? కాంగ్రెస్, వైసీపీలలో ఏ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా బొత్స, ధర్మాన మంత్రు లుగా ఉన్నారు. సంవత్సరాల తరబడి మంత్రులుగా ఉన్న వాళ్లు ఉత్తరాంధ్రకు ఏం ఒరగబెట్టారో చెప్పాలి.
జగన్‌రెడ్డి గ్యాంగ్ భూకబ్జాలపై సీబీఐ విచారణ జరిపించాలి
విశాఖలో జగన్‌రెడ్డి అండ్ గ్యాంగ్ 40వేల ఎకరాలు అన్యాయంగా కొట్టేశారు. ఏజెన్సీ ప్రాంతాలను కొల్ల గొడుతూ, విలువైన బాక్సైజ్ ఖనిజాన్ని లూఠీ చేస్తున్నారు. దసపల్లా భూములు, 22(ఏ)లోని భూములు, రుషికొండ, పంచ గ్రామాల భూముల్ని, గంగవరం పోర్టుని మాయం చేశారు. వీటికి సంబంధించి విజయ సాయిరెడ్డి సమాధా నం చెప్పాలి. వైసీపీ భూకబ్జాలు, దోపిడీ చూసి విశాఖ లోని ప్రజలు నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారు. ఉత్త రాంధ్రపై వాలిన వైసీపీ రాబందుల్ని తరిమికొట్టి,ఆ ప్రాం తాన్ని రక్షించుకోవ లసిన బాధ్యత ఆప్రాంత వాసులంద రిపై ఉంది. వైసీపీ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తిచేసి, 5 లైన్ల రోడ్లు వేసి, పరిశ్రమలు తెచ్చి వారి పనితనం చూపించాలి. కొత్త రాజకీయ డ్రామాలో భాగంగా వైసీపీ పేటీఎం బ్యాచ్, జగన్‌రెడ్డి వీరాభిమానులు నాన్ పొలిటి కల్ జేఏసీని ఏర్పాటుచేశారు.ఉత్తరాంధ్ర వాసులంతా సేవ్ ఉత్తరాంధ్ర నినాదంతో వైసీపీ రాబందుల నుంచి మన ప్రాంతాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఉత్త రాంధ్రలోని వెనుకబడిన జిల్లాలకు టీడీపీ ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులుతీసుకొచ్చింది. అభివృద్ధి చేయడం చేత గాక,మూడు రాజధానుల రాగంఆలపిస్తున్న జగన్ రెడ్డి తక్షణమే అసెంబ్లీని రద్దుచేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.