- లేని దిశ చట్టాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేయటం సిగ్గుచేటు
- మహిళల భద్రత అంటూ ఇప్పుడు నీతిసూక్తులు వల్లిస్తారా?
- అభివృద్ధికి పాటుపడుతున్న ఆయనకు, మీకు పోలికే లేదు
- మీ హయాంలో జరిగిన నేరాలపై ఎప్పుడైనా స్పందించారా?
- 30 వేల మంది మహిళలు ఏమయ్యారో ఇప్పుడైనా చెబుతారా?
- ఐదేళ్లలో జరిగిన అరాచకాలు, కుంభకోణాలపై నోరు విప్పరే?
- గంజాయి, డ్రగ్స్‌తో యువత భవితను నాశనం చేసింది మీరుకాదా?
- చంద్రబాబు, లోకేష్‌పై నోటికొచ్చినట్టు మాట్లాడితే ఖబడ్దార్ జాగ్రత్త
- టీడీపీ నాయకురాలు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ధ్వజం
మంగళగిరి(చైతన్యరథం): ఈ భూమి మీద ఏ మనిషి చేయనన్ని నేరాలు, ఘోరాలు చేసిన వ్యక్తి జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టు పట్టించాడని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. గురువారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 31 కేసుల్లో ముద్దాయిగా ఉండి బెయిల్ మీద బయట తిరుగుతూ ఒక పీడలా దాపురించి పొరపాటున సీఎం అయ్యారని మండిపడ్డారు. ల్యాండ్, శాండ్, లిక్కర్, మైనింగ్ మాఫియా, నవరత్నాల పేరుతో నవమోసాలు, పరిశ్రమలను వెళ్లగొ ట్టడం, యువతను గంజాయి, డ్రగ్స్‌కు బానిసలుగా మార్చడం, 2 లక్షల మంది మహిళలు, చిన్నారులపై నేరాలు జరిగితే స్పందించకపోవటం, అమరావతిని నాశనం చేయడం, పోలవరాన్ని గాలికొ దిలేయడం వంటి విధ్వంస చర్యలతో విసుగెత్తిన ప్రజలు 11 సీట్లతో ఆ పార్టీని భూస్థాపితం చేసి బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు.
తల్లిదండ్రులను దైవ సమానం గా భావిస్తూ 26 వేల కిలోమీటర్లు సీసీ రోడ్లు నిర్మించి, 30 వేల మందికి ఉద్యోగాలు కల్పించిన లోకేష్..20 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా పెట్టుబడుల ఆకర్షణకు తన వంతు ప్రయత్నం చేస్తుంటే విమర్శలు చేయడానికి జగన్‌రెడ్డి సిగ్గుపడాలని హితవుపలికారు. మీ పాలనలో ఇబ్బందులు పడ్డ విద్యార్థుల భవితకు చేయూతనందిస్తూ లోకేష్ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారన్నారు. లేని దిశ చట్టం గురించి పదేపదే ప్రస్తావిస్తూ లోకేష్, హోంమంత్రి అనితపై విమర్శలు చేయటానికి సిగ్గుండాలి. దిశ చట్టమే లేదు..అది కేవలం బిల్లు మాత్రమే..దానిని కేంద్రం ఆమోదించలేదని స్పష్టం చేశారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని లోకేష్ సవాల్ విసిరితే దానికి అంగీకరించే దమ్ముందా అని ప్రశ్నించారు. రోజుల తరబడి అబద్ధాలు చెప్పడమే మీ పని కదా అని మండిపడ్డారు.
లోకేష్‌కు, జగన్‌రెడ్డికి పోలికే లేదు
నారా లోకేష్ యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా టీసీఎస్, ఫాక్స్‌కాన్, ఇతర ఐటీ కంపె నీలను తీసుకొచ్చేందుకు కష్టపడుతుంటే విమర్శలు చేస్తూ జగన్‌రెడ్డికి ఉన్న భయాన్ని బయ ట పెట్టుకుంటున్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం కార్యకర్తల నిధిని ఏర్పాటు చేసిన నారా లోకేష్‌కు, కార్యకర్తలను గాలికొదిలేసిన జగన్‌రెడ్డికి పోలికే లేదన్నారు. మహిళలను బూతు లు తిట్టించి సంతోషపడే వ్యక్తి జగన్‌రెడ్డి అని ఆ పార్టీ కోసం పనిచేసిన మాజీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ చెప్పారు. దీనికి మీ దగ్గర సమాధానముందా జగన్‌రెడ్డి అని ప్రశ్నించారు. జగన్‌రెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో అత్యాచారం జరిగితే బయటకు రాని ఆయన ఈరోజు మహిళా భద్రతకు, అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మభ్యపెట్టే ప్రయత్నాన్ని రాష్ట్ర మహిళలు గమన్నిస్తున్నారని గుర్తు పెట్టుకోవాలని హితవుపలికారు.
కూటమి ప్రభుత్వంలో అమరావతి, పోలవరం పనులు పరుగులు పెడుతున్నాయని, గంజాయి నిర్మూలనకు చర్యలు తీసుకోవడం, సంక్షేమ పథకా లు అమలు చేయడం వంటి పనులన్నీ చూసి జగన్‌రెడ్డి ఫ్రస్టేషన్‌కు గురవుతున్నాడు. ప్రజల సొమ్ము కొట్టేసి సంపాదించిన ఆస్తులను చెల్లికి ఇవ్వడానికి మాట తిప్పి, మడమ తిప్పి నాట కాలాడుతున్న జగన్‌రెడ్డి..ఐదేళ్ల మీ పాలనలో జరిగిన ఇసుక, మద్యం మాఫియా, కుంభకో ణాలు, భూ కబ్జాలపై సమాధానముందా? అదృశ్యమైన 30 వేల మంది మహిళలపై సమా ధానముందా? అని ప్రశ్నించారు. మీరు పెంచిన గంజాయి మూలాలు పెకిలించటానికి కూటమి ప్రభుత్వం కష్టపడి పనిచేస్తుందని, చంద్రబాబు, లోకేష్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్ జాగ్రత్త అని హెచ్చరించారు.