విజయవాడ : బాబాయ్ వివేకానందరెడ్డిని గొడ్డలిపోటుతో చంపిన ముఖ్యమంత్రి ఈరాష్ట్రానికి అవసరమా అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా దేవినేని ఉమ బుధవారం గొల్లపూడిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇసుక, మద్యం లావాదేవీలు ఆన్లైన్ పెమెంట్ లేకుం డా క్యాష్ అండ్ క్యారీ చేసి దోచేసిన ముఖ్యమంత్రి, పెట్రోల్, డీజిల్, గ్యాస్ బండ మీద రాష్ట్రపన్నులు సెస్ వ్యాట్ తగ్గించలేని అసమర్థుడు, కరెంట్ చార్జీలు డబుల్ చేసిన సిఎం,చెత్త మీద పన్ను వేసే చెత్త ముఖ్య మంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా అని ప్రశ్నిం చారు. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్‌రెడ్డి కాదా? ఈరోజు మీరా శ్రీరంగ నీతులు చెప్పేది? మీ తండ్రికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చి న కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసిన విశ్వాస ఘాతకుడు జగన్‌రెడ్డి, మీరా వెన్నుపోటు గురించి మాట్లాడదని దేవినేని ఉమ దుయ్యబట్టారు.